అందుకే యూనివర్స్ బాస్: గేల్ 1000 సిక్సర్ల అరుదైన రికార్డు

By team teluguFirst Published 31, Oct 2020, 1:20 PM
Highlights

ఈమ్యాచులో గేల్ 1000 సిక్సర్లను బాదిన తొలి క్రికెటర్ గా అరుదైన రికార్డును సొంతం  చేసుకున్నాడు. ఈ రికార్డును సాధించడం ద్వారా తానెందుకు యూనివర్స్ బాస్ అనే విషయాన్ని మరోసారి తేల్చి చెప్పాడు క్రిస్ గేల్.

ప్లే ఆప్స్ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ జట్టు పంజాబ్ జట్టుపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 185 పరుగుల భారీ స్కోరును సాధించినప్పటికీ... రాజస్థాన్ రాయల్స్ మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. 

రాజస్థాన్ అద్భుత బ్యాటింగ్ ను కొద్దిసేపు పక్కనపెడితే.... పంజాబ్ భారీ స్కోర్ సాధించడానికి కారణం మాత్రం గేల్ అద్భుత ఇన్నింగ్స్. గేల్ ఈ మ్యాచులో 99 పరుగులు సాధించి సెంచరీకి పరుగు దూరంలో నిష్క్రమించాడు. ఈమ్యాచులో సిక్సర్ల విషయంలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు యూనివర్స్ బాస్. 

ఈమ్యాచులో గేల్ 1000 సిక్సర్లను బాదిన తొలి క్రికెటర్ గా అరుదైన రికార్డును సొంతం  చేసుకున్నాడు. ఈ రికార్డును సాధించడం ద్వారా తానెందుకు యూనివర్స్ బాస్ అనే విషయాన్ని మరోసారి తేల్చి చెప్పాడు క్రిస్ గేల్. తరువాతి స్థానంలో కీరన్ పోలార్డ్ ఉన్నాడు. 

T20 ka Bradman- Chris Gayls. Without a doubt the greatest that there has ever been . Entertainment ka baap.

— Virender Sehwag (@virendersehwag)

Gayle Storm. Yesterday...today....tomorrow. 24x7...365 days a year.
Entertainment Guaranteed. 👏👏

— Aakash Chopra (@cricketaakash)

గేల్ సిక్సర్ల రికార్డును సాధించిన వెంటనే అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మాజీ క్రికెటర్లు, అభిమానులు గేల్ రికార్డును గూర్చి  మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

Gayle Storm. Yesterday...today....tomorrow. 24x7...365 days a year.
Entertainment Guaranteed. 👏👏

— Aakash Chopra (@cricketaakash)

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 31, Oct 2020, 1:20 PM