ఐపిఎల్ 2020: ఒక్క పరుగుతో సెంచరీ మిస్సైన గేల్ ఆగ్రహంతో....

By telugu teamFirst Published Oct 31, 2020, 9:08 AM IST
Highlights

ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ కావడంతో క్రిస్ గేల్ తీవ్ర ఆగ్రహానికి, అసహనానికి గురయ్యాడు. రాజస్థాన్ రాయల్స్ మీద జరిగిన మ్యాచులో ఆర్చర్ బౌలింగులో గేల్ 99 పరుగుల స్కోరు వద్ద అవుటయ్యాడు.

దుబాయ్: రాజస్థాన్ రాయల్స్ మీద శుక్రవారం సాయంత్రం జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 63 బంతుల్లో ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్స్ లతో 99 పరుగులు చేశాడు. ఒక్క పరుగుతో సెంచరీ మిస్సయ్యాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆర్చర్ బౌలింగులో అవుటయ్యాడు. 

ఒక్క పరుగుతో సెంచరీ మిస్సైన కోపాన్ని క్రిస్ గేల్ నిలువరించుకోలేకపోయాడు. అసహనంతో బ్యాట్ ను నేలకేసి కొట్టాడు. ఆ సమయంలో బ్యాట్ చేతిలోంచి జారి కాస్తా దూరంలో పడింది. ఆ తర్వాత తనను అవుట్ చేసిన ఆర్చర్ తో కరచాలనం చేసి వెనుదిరిగాడు. 

Also Read: ఐపిఎల్ 2020: టీ20ల్లో వేయి సిక్స్ లు బాదిన తొలి 'బాస్' ఇతనే

సెంచరీ సాధించలేకపోయినా క్రిస్ గేల్ ఐపిఎల్ లో వేయి సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సెంచరీ మిస్ కావడం దురదృష్టకరమని, అయితే ఇది క్రికెట్ లో భాగమేనని క్రిస్ గేల్ ఆ తర్వాత చెప్పాడు. 

ఆర్చర్ బౌలింగులో సిక్సర్ బాదిన క్రిస్ గేల్ ఆ తర్వాతి బంతికే 99 పరుగుల వద్ద అవుటయ్యాడు. ఆర్చర్ వేసిన బంతి ప్యాడ్స్ కు తగిలి స్టంప్స్ ను పడగొట్టింది. దాంతో గేల్ కోపాన్ని అణచుకోలేకపోయాడు. 

ఆర్చర్ అద్భుతమైన బంతిని వేశాడని, సెంచరీ మిస్సైనప్పటికీ ఆనందంగానే ఉందని చెప్పాడు. నిజాయితీగా చెప్పాలంటే అది తన ఆటలోని మానసికరపమైన అంశమని, అదే తనను ముందుకు నడిపిస్తోందని, అదే రీతిలో తాను క్రికెట్ ను ఆనందిస్తున్నానని ఆయన అన్నాడు. 

వేయి సిక్స్ మార్కును దాటిన విషయాన్ని ప్రస్తావించగా తనకు ఆ విషయం తెలియనది, తాను ఇప్పటికీ బంతిని బలంగా బాదుతున్నానని ఆయన చెప్పాడు. తాను యువకులతో క్రికెట్ ఆడడాన్ని ఆనందిస్తానని ఆయన అన్నాడు. 

click me!