ఐపీఎల్ 2020: హోల్డర్ డ్రాప్ చేసిన స్టోయినిస్ క్యాచ్ కొంప ముంచింది

Published : Nov 09, 2020, 08:28 AM IST
ఐపీఎల్ 2020: హోల్డర్ డ్రాప్ చేసిన స్టోయినిస్ క్యాచ్ కొంప ముంచింది

సారాంశం

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో మార్కుస్ స్టోయినిస్ క్యాచ్ ను జసోన్ హోల్డర్ జారవిడిచాడు. అదే సన్ రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచింది. ఆ క్యాచ్ పట్టి ఉంటే ఢిల్లీని కట్టడి చేసి ఉండేవారు.

అబుదబీ: ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన రెండో క్వాలిఫయిర్ మ్యాచ్ లో జసోన్ హోల్డర్ డ్రాప్ చేసిన స్టోయినిస్ క్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కొంప ముంచింది. అనూహ్యంగా శిఖర్ ధావన్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ మార్కుస్ స్టోయినిస్ ను పంపించింది. ఇన్నింగ్స్ మూడో ఓవరులో హోల్డర్ సిల్లీ మిడాన్ లో స్టోయినిస్ క్యాచ్ ను జారవిడిచాడు. 

ఆ సమయంలో స్టోయినిస్ ఆరు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత పవర్ ప్లేలో స్టోయినిస్ రెచ్చిపోయాడు. ఆ తర్వాత రెండు ఓవర్లలోనూ సందీప్ ధారాళంగా పరుగులు పిండుతున్నాడు. సందీప్ వేసిన ఆ ఓవరులో రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి ఓవరులో మూడు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టాడు.

మరో వైపు శిఖర్ ధావన్ కూడా దూకుడు ప్రదర్శించాడు. దాంతో ఐదు ఓవర్లలోనే ఢిల్లీ 50 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసేటప్పటికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు సాధఇంచింది. 

ఎట్టకేలకు రషీద్ ఖాన్ స్టోయినిస్ ను పెవిలియన్ కు చేర్చాడు. అప్పటికి స్టోయినిస్ 27 బంతుల్లో 38 పరుగులు చేశాడు. హోల్డర్ క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల 35 పరుగులు సన్ రైజర్స్ హైదరాబాద్ సమర్పించుకుంది.

 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !