IPL 2020: ధోనీ వయసుపై ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ కామెంట్...

Published : Oct 03, 2020, 04:05 PM IST
IPL 2020: ధోనీ వయసుపై ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ కామెంట్...

సారాంశం

‘కొందరికి వయసు కేవలం ఓ నెంబర్ మాత్రమే... మరికొందరికి జట్టులో నుంచి తప్పించడానికి వయసు ఓ కారణం...’ అంటూ ట్వీట్ చేసిన ఇర్ఫాన్ పఠాన్...

IPL 2020 సీజన్ ఆడుతున్నవారిలో అత్యంత అనుభవజ్ఞుడు మహేంద్ర సింగ్ ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్‌కి సారథ్యం వహిస్తున్న ధోనీ, 39 ఏళ్ల వయసులో కూడా తన బ్యాటింగ్‌లో సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నాడు. గత మ్యాచ్‌లో అద్భుతంగా పోరాడి 36 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేశాడు. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ వయసుపై చర్చ నడుస్తోంది.

భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్... ఈ విషయంపై ఘాటు కామెంట్ చేశాడు. ‘కొందరికి వయసు కేవలం ఓ నెంబర్ మాత్రమే... మరికొందరికి జట్టులో నుంచి తప్పించడానికి వయసు ఓ కారణం...’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్. భారత జట్టులో లెజెండ్స్‌గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ వంటివారిని వయసు కారణంగా చూపి పక్కనబెట్టాడు ధోనీ.

 

 

భారత జట్టుకి ఎంతో సేవ చేసిన వీరిలో చాలామందికి ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా దొరకలేదు. దీంతో ఇర్ఫాన్ పఠాన్ చేసిన కామెంట్ టాక్ ఆఫ్ ది టౌక్ అయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు