రాయుడు లేకపోవడం వల్లే ఓడిపోయాం.. ధోనీ

Published : Sep 26, 2020, 10:16 AM IST
రాయుడు లేకపోవడం వల్లే ఓడిపోయాం.. ధోనీ

సారాంశం

 తర్వాతి మ్యాచ్ సమయానికి  రాయుడు అందుబాటులోకి వస్తే.. అంతా సర్దుకుంటుందని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. కాగా.. శుక్రవారం ఢిల్లీ చేతిలో చెన్నై ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.  

అంబటి రాయుడు లేకపోవడం వల్ల తమ జట్టు ఓటమిపాలయ్యిందని  చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. అతను లేకపోవడం వల్ల జట్టులో బ్యాలెన్స్ తప్పిపోతోందని ఆయన పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచ్ సమయానికి  రాయుడు అందుబాటులోకి వస్తే.. అంతా సర్దుకుంటుందని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. కాగా.. శుక్రవారం ఢిల్లీ చేతిలో చెన్నై ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.

కాగా.. ఈ మ్యాచ్ కోల్పోయిన తర్వాత ధోనీ మాట్లాడారు. ‘ అంబటి రాయుడు లేకపోవడం వల్లనే చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయాం. బ్యాటింగ్ ఆర్డర్లో బ్యాలెన్సింగ్ రావడం లేదు. ఇది మాకు మంచి మ్యాచ్ కాదు. బ్యాటింగ్ విభాగంలో కసి తగ్గడం మమ్మల్ని బాధిస్తోంది. రన్ రేటుతోపాటు పెరగడంతో మాపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. స్పష్టమైన లక్ష్యంతో మేం బరిలోకి దిగాలి. తర్వాతి మ్యాచ్ లో అంబటి రాయుడు వస్తే జట్టు మళథ్లీ ఫాంలోకి వస్తుంది’ అని ధోనీ పేర్కొన్నారు. కాగా.. ముంబయితో జరిగిన తొలి మ్యాచ్ లో 48బంతుల్లో 71 పరుగులు చేసి అంబటి రాయుడు అదర గొట్టాడు. అయితే.. అదే మ్యాచ్ లో అతను గాయపడ్డాడు. ఈ క్రమంలో తర్వాతి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఆ రెండు మ్యాచులు చెన్నై ఓడిపోవడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?