IPL 2020: వార్నర్ భాయ్‌ని కేక్‌లో ముంచేసిన సన్‌రైజర్స్... డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చరచ్చ...

Published : Oct 28, 2020, 05:23 PM IST
IPL 2020: వార్నర్ భాయ్‌ని కేక్‌లో ముంచేసిన సన్‌రైజర్స్... డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చరచ్చ...

సారాంశం

IPL 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ హాఫ్‌లో స్థాయికి తగిన ప్రదర్శన ఇచ్చింది. అయితే సెకండాఫ్‌లో వరుసగా హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే వార్నర్ భాయ్ పుట్టినరోజున ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి వన్‌ సైడ్ విక్టరీ కొట్టింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 

ఈ భారీ విజయంతో ఫుల్ జోష్‌లో డేవిడ్ వార్నర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది ఆరెంజ్ ఆర్మీ. డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన రచ్చ సెలబ్రేషన్స్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. 34వ పుట్టినరోజు జరుపుకుంటున్న డేవిడ్ వార్నర్‌ ముఖానికి కేక్ మొత్తం పూసేశారు సన్‌రైజర్స్ యంగ్ ప్లేయర్లు ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, ఖలీల్ అహ్మద్.

దీంతో రెచ్చిపోయిన డేవిడ్ వార్నర్ జట్టు సభ్యులందరిపై కేక్ విసరడం మొదలెట్టారు. సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్‌కి కేక్ పూశాడు వార్నర్. మురళీధరన్ కౌంటర్ కేక్ అటాక్ చేశాడు. గార్గ్, వృద్ధమాన్ సాహాకి శ్రద్ధగా కేక్ పూస్తుండగా వెనకనుంచి వచ్చి అతనిపై కేక్‌పై అటాక్ చేశాడు వార్నర్.

మొత్తంగా వార్నర్ భాయ్ బర్త్ డే సెలబ్రేషన్స్‌ను ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంది ఆరెంజ్ ఆర్మీ. 12 మ్యాచుల్లో ఐదింట్లో గెలిచిన సన్‌రైజర్స్, ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మిగిలిన మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. పూర్తి వీడియోను ఇక్కడ చూడండి.

 

PREV
click me!

Recommended Stories

T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు