అవే తప్పులు చేశాం: సన్ రైజర్స్ హైదరాబాదు మీద ఓటమిపై ధోనీ

Published : Oct 03, 2020, 08:31 AM IST
అవే తప్పులు చేశాం: సన్ రైజర్స్ హైదరాబాదు మీద ఓటమిపై ధోనీ

సారాంశం

శుక్రవారం జరిగిన మ్యాచులో తమ జట్టు ఓటమి పాలు కావడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందించారు. చేసిన తప్పులే మళ్లీ చేశామని, వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ధోనీ అన్నారు.

దుబాయ్: ఐపిఎల్ 2020లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాదు మీద ఓటమి పాలు కావడంపై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్పందించారు. చాలా వాటిని సరైన దిశలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చేసిన తప్పులే మళ్లీ చేశామని ఆయన చెప్పారు. 

హైదరాబాదు సన్ రైజర్స్ మీద జరిగిన మ్యాచులో సీఎస్కే 7 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ఆ జట్టుకు వరుసగా మూడో ఓటమి. దీంతో పాయింట్ల పట్టికలో జట్టు అన్ని జట్ల కన్నా దిగువన ఉంది. నాలుగు మ్యాచులు ఆడి రెండు గెలిచిన హైదరాబాదు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. 

నో బాల్స్ వేశామని, క్యాచ్ లు జార విడిచామని, అవే తప్పులు మళ్లీ మళ్లీ చేస్తున్నామని ధోనీ అన్నారు. 16వ ఓవరుతో రెండు చెత్త ఓవర్లు వేశామని ఆయన చెప్పారు. మొత్తంగా చూస్తే కాస్తా మెరుగుపడ్డామని అన్నారు. 

సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ పిచ్ మీద విమర్శలు చేశారు. అయితే, తమ ఆటగాళ్లు బాగా ఆడారని ఆయన అన్నారు.  టాస్ గెలిచి వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ ఐదు వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. ప్రియం గార్గ్ ఐపిఎల్ తన తొలి అర్థ సెంచరీని నమోదు చేశాడు. అభిషేక్ శర్మ అతని మంచి సహకారాన్ని అందించాడు. 

PREV
click me!

Recommended Stories

Cricketers Assault : ఎంతకు తెగించార్రా..గ్రౌండ్ లోనే క్రికెట్ కోచ్‌ తల పగలగొట్టిన ప్లేయర్స్ !
IPL Brand Value: ఐపీఎల్ జట్లకు బిగ్ షాక్.. సన్‌రైజర్స్, ఆర్సీబీ బ్రాండ్ విలువ ఢమాల్ ! కష్టమేనా?