CSK vs SRH: యంగ్ స్టార్స్ దూకుడు... మంచి స్కోరు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

Published : Oct 02, 2020, 09:16 PM IST
CSK vs SRH: యంగ్ స్టార్స్ దూకుడు... మంచి స్కోరు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్...

సారాంశం

మరోసారి సన్‌రైజర్స్ బ్యాటింగ్ టాపార్డర్ ఫెయిల్... అద్భుత ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్న ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ...  ప్రియమ్ గార్గ్ అద్భుత హాఫ్ సెంచరీ...  

IPL 2020 సీజన్‌ 13లో హైదరాబాద్ యంగ్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో మరోసారి డకౌట్‌గా వెనుదిరగగా మనీశ్ పాండే 21 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 

తన స్టైల్‌కి భిన్నంగా ఆడి 29 బంతుల్లో 28 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్... భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ కాగా, తర్వాతి బంతికే కేన్ విలియంసన్ రనౌట్ అయ్యాడు. 69 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో యంగ్ బ్యాట్స్‌మెన్ ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.

ఐదో వికెట్‌కి 43 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత అభిషేక్ వర్మ అవుట్ అయ్యాడు. అభిషేక్ అవుటైన తర్వాత కూడా దూకుడు కొనసాగించిన ప్రియమ్ గార్గ్ 23 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది