సిఎస్కే వర్సెస్ డీసీ: అగ్రస్థానంపై ఢిల్లీ గురి కుదిరేనా..?

By team teluguFirst Published Oct 17, 2020, 12:51 PM IST
Highlights

ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. 8 మ్యాచుల్లో ఐదు పరాజయలతో టాప్‌-4లోకి వచ్చేందుకు ధోనీసేన విశ్వప్రయత్నాలు చేస్తోంది.

ఐపీఎల్‌లో నిలకడగా విఫమయ్యే జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌. ఐపీఎల్‌లో అత్యంత నిలడకగా రాణించే జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌. జస్ట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌ అన్నట్టు ఈ సీజన్‌లో అందుకు భిన్నంగా సాగుతోంది. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా.. 8 మ్యాచుల్లో ఐదు పరాజయలతో టాప్‌-4లోకి వచ్చేందుకు ధోనీసేన విశ్వప్రయత్నాలు చేస్తోంది.  నేడు పొట్టి బౌండరీల షార్జాలో చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌లు రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది.

మ్యాచ్‌కు ముందు ముచ్చట్లు:

1. షేన్ వాట్సన్‌ సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌ను ఓపెన్‌ చేసినా, చేయకపోయినా.. అతడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ పదునైన అస్ర్తం సిద్ధం చేసి ఉంచింది. ఎనిమిది టీ20 ఇన్నింగ్స్‌లో అక్షర్‌ పటేల్‌కు ఏకంగా ఆరు సార్లు వికెట్‌ కోల్పోయాడు వాట్సన్‌. అతడిపై 43 బంతుల్లో 44 పరుగులే చేశాడు.

2. చెన్నై పేసర్‌ దీపక్‌ చాహర్‌కు పృథ్వీ షాపై మంచి రికార్డుంది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో  పృథ్వీ షాను చాహర్‌ నాలుగు సార్లు అవుట్‌ చేశాడు.  దీపక్‌పై షా 37 బంతుల్లో 38 పరుగులే చేశాడు. అజింక్య రహానెను సైతం చాహర్‌ మూడు ఇన్నింగ్స్‌లో మూడుసార్లు అవుట్‌ చేశాడు. శిఖర్ ధావన్‌పైనా దీపక్‌కు మంచి గణాంకాలు ఉన్నాయి. ఢిల్లీ ఇన్నింగ్స్‌ పవర్‌ప్లేలో దీపక్‌ చాహర్‌ ఓవర్లపై ఆసక్తి నెలకొంది.

3. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముఖాముఖి మ్యాచుల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. 22 మ్యాచుల్లో 15 సార్లు విజయాలు సాధించింది.

4. ఐపీఎల్‌ 2020లో పవర్‌ ప్లేలో అత్యంత దారుణంగా పరుగులు చేస్తోన్న జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌. తొలి ఆరు ఓవర్లలో సూపర్‌కింగ్స్‌ 7.2 రన్‌రేట్‌ మాత్రమే కలిగి ఉంది.

5. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన రికార్డు సునీల్‌ నరైన్‌పై ఉంది. 32 మ్యాచుల్లో నరైన్‌ 50 వికెట్ల క్లబ్‌లో ఉంది. కగిసో రబాడ 26 మ్యాచుల్లో 49 వికెట్లు తీశాడు. నేటి మ్యాచ్‌లో ఓ వికెట్‌ కూల్చితే.. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 వికెట్లు కూల్చిన బౌలర్‌గా కగిసో రబాడ నిలువనున్నాడు.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), మార్కస్‌ స్టోయినిస్‌, అలెక్స్‌ కేరీ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, కగిసో రబాడ, తుషార్‌ దేశ్‌పాండే, ఎన్రిచ్‌ నోక్యా.

చెన్నై సూపర్‌కింగ్స్‌: డుప్లెసిస్‌, శామ్‌ కరన్‌, షేన్‌ వాట్సన్‌, అంబటి రాయుడు, ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌), రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, దీపక్‌ చాహర్‌, పియూశ్‌ చావ్లా, షార్దుల్‌ ఠాకూర్‌, కరన్‌ శర్మ.   

click me!