ఐపిఎల్ 2020: బ్యాట్ విసిరికొట్టిన క్రిస్ గేల్ కు జరిమానా

By telugu teamFirst Published Nov 1, 2020, 10:18 AM IST
Highlights

జోఫ్రా అర్చర్ బౌలింగులో 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ కు ఐపిఎల్ జరిమానా విధించింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా వేసినట్లు తెలిపింది.

అబు దబి: రాజస్థాన్ రాయల్స్ మీద జరిగిన మ్యాచులో ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడనే కారణంతో కింగ్స్ ఎలెవెన్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ కు జరిమానా విధించారు. అతని మ్యాచు ఫీజులో పది శాతం కోత పడింది. అయితే ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఎక్కడ ఉల్లంఘించాడనే విషయాన్ని ఐపిఎల్ యాజమాన్యం చెప్పలేదు. 

శుక్రవారం రాత్రి 99 పరుగుల వద్ద అవుటైన క్రిస్ గేల్ బ్యాట్ ను నేలకేసి కొట్టాడు. అందుకే అతనికి జరిమానా విధించినట్లు భావిస్తున్నారు. తాను తప్పు చేసినట్లు గేల్ అంగీకరించి, జరిమానా విధింపును అంగీకరించాడు. 

జోఫ్రా ఆర్చర్ చివరి ఓవరులో వేసిన యార్కర్ కు క్రిస్ గేల్ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. సెంచరీ పూర్తి చేయలేకపోయాననే అసహనంతో అతను బ్యాట్ ను నేలకేసి కొట్టాడు. రాజస్థాన్ రాయల్స్ మీద జరిగిన మ్యాచులో క్రిస్ గేల్ డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని, అందుకు మ్యాచు ఫీజులో పది శాతం కోత విధించామని యాజమాన్యం తెలిపింది. 

41 ఏళ్ల క్రిస్ గేల్ ఎనిమిది సిక్స్ లు, ఆరు ఫోర్లతో 99 పరుగులు చేశాడు. టీ20ల్లో వేయి సిక్స్ లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే, గేల్ అద్భుతమైన ప్రదర్శన వృధా అయింది. రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ మీద విజయం సాధించింది.

click me!