జంతువులంటే ప్రేమ.. వ్యాపారంలోనూ సూపర్ హిట్.. లార్డ్ శార్దూల్ వైఫ్ మిథాలీ గురించి ఆసక్తికర విషయాలు..

Published : Feb 28, 2023, 12:02 PM IST
జంతువులంటే ప్రేమ.. వ్యాపారంలోనూ సూపర్ హిట్.. లార్డ్ శార్దూల్ వైఫ్ మిథాలీ గురించి ఆసక్తికర విషయాలు..

సారాంశం

Shardul Thakur Wedding: టీమిండియా  ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్   నిన్న ఓ ఇంటివాడయ్యాడు.  తన  ప్రేయసి మిథాలీ పారుల్కర్ తో  సోమవారం శార్దూల్ వివాహ వేడుక ఘనంగా  జరిగింది. 

టీమిండియా ఆల్ రౌండర్  శార్దూల్ ఠాకూర్  సోమవారం తన ప్రేయసి మిథాలీ పారుల్కర్ తో  కలిసి ఏడడగులు నడిచాడు.   చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ  వివాహబంధంతో ఒక్కటయ్యారు.  నవంబర్ లో ఈ ఇద్దరి మధ్య ఎంగేజ్మెంట్ ముగియగా తాజాగా పెళ్లి  ఘనంగా జరిగింది.  టీమిండియా అభిమానులు ‘లార్డ్’ అని పిలుచుకునే  శార్దూల్ ఠాకూర్ భార్య అయిన మిథాలీ ఎవరు..? అని నెటిజన్లు తెగ  సెర్చ్ చేస్తున్నారు.  ఆమె నేపథ్యం గురించి  వెతుకుతున్నారు.  

మిథాలీ పారుల్కర్  1992లో మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో  జన్మించింది.  ఆమె బాల్యం, విద్యాబ్యాసం అంతా ముంబైలోనే జరిగింది.   2014లో ఆమె చదువు పూర్తి చేసుకుని  ఉద్యోగ వేట ప్రారంభించింది.  కొన్నాళ్లు పలు  సంస్థలలో పనిచేసిన ఆమె తర్వాత  స్వంతంగా  వ్యాపారం చేద్దామని ఫిక్స్ అయి  ఇటువైపుగా అడుగులు వేసింది. 

2020లో  ముంబై సమీపంలోని థానేలో  ఆమె సొంతంగా ఓ బేకరీ ని స్థాపించింది. తొలినాళ్లలో  ఇంట్లోనే బేకరీ ఐటెమ్స్  చేసి వాటిని  నేరుగా విక్రయించడంతో పాటు ఆన్‌లైన్ లో కూడా  అమ్మకాలు చేసింది.   కొద్దిరోజుల్లోనే ఈ బేకరీ బిజినెస్ సక్సెస్ అయింది.  రుచికరమైన బేకరీ ఐటెమ్స్ ను తక్కువ ధరకే అందించడంతో  పాటు నాణ్యత కూడా  మెరుగ్గా ఉండటంతో  ముంబైవాసులు మిథాలీ బేకరీ ఫుడ్స్ పై  మక్కువ పెంచుకున్నారు. ఇక శార్దూల్ తో ఆమె నిశ్చితార్థం జరిగాక మిథాలీ బేకరీ బిజినెస్ కు  క్రేజ్ పెరిగింది. ఆనతికాలంలోనే  ఆమె ముంబైలో కూడా తన  కార్యాలయాలు  ఓపెన్ చేసింది. 

 

బేకరీ ఫుడ్స్ బిజినెస్ తో పాటు  ఆమెకు జంతువుల రక్షణ అంటే కూడా చాలా ఇష్టమట. పెంపుడు జంతువులంటే ఇష్టపడే ఆమె.. ముంబైలోని పలు సంస్థలతో కలిసి ఆమె జంతు రక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంది.  ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తుంటుంది. 

 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !