అవసరమైన ఇంజక్షన్ తీసుకుని బ్యాటింగ్‌కి... జడ్డూ ఏం చేయడానికైనా....

Published : Jan 11, 2021, 06:49 AM IST
అవసరమైన ఇంజక్షన్ తీసుకుని బ్యాటింగ్‌కి... జడ్డూ ఏం చేయడానికైనా....

సారాంశం

మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా ఎడమ చేతి బొటిన వేలుకి గాయం... ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించిన ఫిజియో... జట్టు అవసరాల కోసం ఇంజక్షన్ తీసుకుని, బరిలో దిగుతానని చెప్పిన జడ్డూ...

జట్టు కోసం ఏం చేయడానికి సిద్ధపడే క్రికెటర్ రవీంద్ర జడేజా. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డేలో గాయపడినా, అలాగే బ్యాటింగ్ కొనసాగించిన జడేజా... ఆ తర్వాత టీ20 సిరీస్‌కి, మొదటి టెస్టుకి దూరమయ్యాడు. రీఎంట్రీతో అదరగొడుతున్న రవీంద్ర జడేజాను ఎలా అడ్డుకోవాలో తెలియని ఆసీస్... మరోసారి అతన్ని గాయపరిచింది.

మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లోనే మరోసారి రవీంద్ర జడేజాకి గాయం కారణంగా ఆఖరి టెస్టుకి దూరం కాబోతున్నాడు. రవీంద్ర జడేజా గాయం తగ్గడానికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించాడు వైద్యలు. అయితే నాలుగో ఇన్నింగ్స్‌లో అవసరమైతే ఇంజక్షన్ తీసుకుని బ్యాటింగ్ చేయడానికి సిద్ధమని జట్టు యాజమాన్యంతో చెప్పాడట రవీంద్ర జడేజా.

బాక్సింగ్ డే టెస్టులో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన రవీంద్ర జడేజా, మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా 28 పరుగులతో రాణించాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జట్టును ఓటమి నుంచి తప్పించడానికి బ్యాటింగ్ చేయడానికి సిద్ధమని ప్రకటించిన జడ్డూ, టీమిండియా అభిమానుల మనసులను మరోసారి గెలిచేశాడు.

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?