CWG 2022 Semi-finals: స్మృతి మంధాన సెన్సేషనల్ ఇన్నింగ్స్.. అయినా భారీ స్కోరు మిస్...

Published : Aug 06, 2022, 05:16 PM IST
CWG 2022 Semi-finals: స్మృతి మంధాన సెన్సేషనల్ ఇన్నింగ్స్.. అయినా భారీ స్కోరు మిస్...

సారాంశం

ఇంగ్లాండ్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని పెట్టిన భారత జట్టు... 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రికార్డు క్రియేట్ చేసిన స్మృతి మంధాన... 

కామన్వెల్త్ గేమ్స్ 2022 వుమెన్స్ క్రికెట్ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత వైస్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన సెన్సేషనల్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టింది. ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టుకి రికార్డు హాఫ్ సెంచరీతో మంచి స్కోరు అందించింది స్మృతి మంధాన...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగుల స్కోరు చేసింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన స్మృతి మంధాన, ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆటాడుకుంది. దీంతో పవర్ ప్లేలో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది...

తొలి ఓవర్‌లో 6 పరుగులు రాగా, ఆ తర్వాత వరుసగా 11, 11, 12, 11, 13 పరుగులు రాబట్టిన స్మృతి మంధాన 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. భారత జట్టు తరుపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా తన రికార్డును మరింత మెరుగుపర్చుకుంది స్మృతి మంధాన...

ఇంతకుముందు 2019లో న్యూజిలాండ్‌పై 24 బంతుల్లో, అంతకుముందు 2018లో ఇంగ్లాండ్‌పై 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన స్మృతి మంధాన, నేటి మ్యాచ్‌లో 23 బంతుల్లోనే ఆ మార్కును అందుకుంది. అంతేకాకుండా టీ20ల్లో పవర్ ప్లే లోపే అర్ధ శతకం పూర్తి చేసుకున్న మొట్టమొదటి భారత మహిళా క్రికెటర్‌గా నిలిచింది స్మృతి మంధాన...

ఓ ఎండ్‌లో స్మృతి మంధాన బౌండరీలు బాదుతుంటే, మరో ఎండ్‌లో షెఫాలీ వర్మకు ఎక్కువగా స్ట్రైయికింగ్ కూడా దక్కలేదు. షెఫాలీ వర్మ కూడా ఆరో ఓవర్‌లో రెండు ఫోర్లు బాది టచ్‌లోకి రావడంతో 7 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది భారత జట్టు...

దీంతో భారత జట్టు ఈజీగా 190-200+ స్కోరు చేస్తుందని భావించారు టీమిండియా ఫ్యాన్స్. అయితే 17 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసిన షెఫాలీ వర్మను అవుట్ చేసిన ఫ్రెయా కెంప్, భారత జట్టు స్కోరుకి బ్రేకులు వేసింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే స్మృతి మంధాన కూడా అవుటైంది...

32 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసిన స్మృతి మంధాన, నటలై సివర్ బౌలింగ్‌లో వాంగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైంది. దీంతో 7వ ఓవర్ ముగిసిన తర్వాత రెండు ఓవర్లలో 4 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

20 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ కూడా ఫ్రెయా కెంప్ బౌలింగ్‌లో అవుట్ కాగా దీప్తి శర్మ 20 బంతుల్లో 2 ఫోర్లతో 22 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో అవుటైంది. ఆ తర్వాతి బంతికే పూజా వస్త్రాకర్ ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే రనౌట్ అయ్యింది...

31 బంతుల్లో 7 ఫోర్లతో 44 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్స్, ఆఖరి బంతికి ఫోర్ బాదింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో కేవలం 2 పరుగులు ఇవ్వడం విశేషం. 

PREV
click me!

Recommended Stories

SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం
IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !