INDvsWI 3rd T20I: టాస్ గెలిచిన విండీస్... నాలుగు మార్పులతో బరిలో భారత జట్టు...

Published : Feb 20, 2022, 06:36 PM ISTUpdated : Feb 20, 2022, 07:09 PM IST
INDvsWI 3rd T20I: టాస్ గెలిచిన విండీస్... నాలుగు మార్పులతో బరిలో భారత జట్టు...

సారాంశం

 India vs West Indies 3rd T20I: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్... నాలుగేసి మార్పులతో ఇరు జట్లు... విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌కి విశ్రాంతి...

టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. టీమిండియా టూర్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన వెస్టిండీస్, ఆఖరి మ్యాచ్‌లో గెలిచి విజయంతో టూర్‌కి ముగింపు పలకాలని భావిస్తోంది.

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్ నుంచి టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసే అవకాశం కోల్పోయిన యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్, ఎట్టకేలకు నేటి మ్యాచ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు... అలాగే ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన తర్వాత యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్, తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు...

ఇప్పటికే టీ20 సిరీస్ గెలవడంతో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లతో సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్‌లకు విశ్రాంతి కల్పించింది భారత జట్టు... యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తాడని కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్ చేశాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌ డౌన్‌లో వచ్చిన రోహిత్ శర్మ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చేయలేదు టీమిండియా... మొదటి రెండు టీ20ల్లో పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయిన యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కి నేటి మ్యాచ్ కీలకం కానుంది. 

సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి విశ్రాంతి కల్పించడంతో ఒకే ఒక్క యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌తో బరిలో దిగుతోంది భారత జట్టు... యజ్వేంద్ర చాహాల్‌కి విశ్రాంతి ఇచ్చినా, సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కి తుది జట్టులో చోటు దక్కకపోవడం విశేషం. 

వెంకటేశ్ అయ్యర్‌తో పాటు దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్ పేస్ ఆల్‌రౌండర్లుగా బరిలో దిగుతుంటే హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్ కూడా ఫాస్ట్ బౌలర్లే. వెస్టిండీస్ జట్టు కూడా ఆఖరి టీ20 మ్యాచ్‌లో నాలుగు మార్పులతో బరిలో దిగుతోంది.

పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వరుసగా 8 మ్యాచుల్లో విజయాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 సిరీస్‌లోనూ అదే ఫీట్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. 

భారత జట్టు: రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ ( వికెట్ కీపర్), రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, హర్షల్ పటేల్, రవి భిష్ణోయ్, ఆవేశ్ ఖాన్  

వెస్టిండీస్ జట్టు: కేల్ మేయర్స్, షై హోప్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రోవ్‌మెన్ పావెల్, కిరన్ పోలార్డ్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రోస్టన్ ఛేజ్, రొమారియో షెఫర్డ్, డొమినిక్ డ్రేక్స్, ఫ్యాబియన్ ఆలెన్, హేడెన్ వాల్ష్ 

PREV
click me!

Recommended Stories

SRH Dangerous Batsmen : ఇషాన్ నుండి అభిషేక్ వరకు.. IPL 2026 లో టాప్ 5 డేంజర్ బ్యాటర్లు, లిస్ట్ లో ఒకేఒక్క తెలుగోడు
Bumrah Top 5 Innings : ఇంటర్నేషనల్ క్రికెట్లో దశాబ్దం పూర్తి.. ఈ పదేళ్లలో బుమ్రా టాప్ 5 ఇన్నింగ్స్ ఇవే