INDvsSL 2nd T20I: టాస్ గెలిచిన రోహిత్ శర్మ... మరో సిరీస్ లక్ష్యంగా హిట్ మ్యాన్...

Published : Feb 26, 2022, 06:34 PM ISTUpdated : Feb 26, 2022, 06:43 PM IST
INDvsSL 2nd T20I:  టాస్ గెలిచిన రోహిత్ శర్మ... మరో సిరీస్ లక్ష్యంగా హిట్ మ్యాన్...

సారాంశం

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ... తొలుత బ్యాటింగ్ చేయనున్న శ్రీలంక...

India vs Sri Lanka 2nd T20I: శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా, రెండో టీ20 కోసం ధర్మశాల చేరుకుంది. ధర్మశాలలో వచ్చే  రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ...

శనివారం 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రెండు రోజులుగా ఎడతెడపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ, గ్రౌండ్ మన్ కృషి కారణంగా మ్యాచ్ సమయానికి పిచ్ సిద్ధమవుతుందని అంచనా వేస్తున్నారు... 

ధర్మశాలలో ఇప్పటివరకూ భారత జట్టు ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడింది. 2015లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేసినా టీమిండియా ఓటమి చవి చూసింది. 2019లో సౌతాఫ్రికాతో ఇదే వేదికపై టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉన్నా, వర్షం కారణంగా ఆ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది...

కెప్టెన్‌గా వరుసగా 10 మ్యాచుల్లో గెలిచి చరిత్ర క్రియేట్ చేసిన రోహిత్ శర్మ, ఆ జోరును తగ్గకుండా కొనసాగించాలని ఆశిస్తున్నారు. గాయాల కారణంగా కీలక ప్లేయర్లు దూరం కావడంతో భారత జట్టు జోరుకి కనీస పోరాటం చూపించలేకపోతోంది శ్రీలంక జట్టు..

మరో వైపు భారత జట్టు... సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్లు గాయం కారణంగా లంక సిరీస్‌కి దూరమైనా ఆ ప్రభావం ఏ మాత్రం కనిపించకుండా అదరగొడుతోంది. తొలి టీ20 మ్యాచ్‌లో 89 పరుగులతో రాణించిన ఇషాన్ కిషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి...

వెస్టిండీస్ సిరీస్‌లో ఘోరంగా ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్, తొలి మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తర్వాత మళ్లీ ఫెయిల్ అయితే అతనిపై తీవ్రమైన విమర్శలు రావడం గ్యారెంటీ. తొలి టీ20 మ్యాచ్‌లో ఇచ్చిన జోష్‌తో ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలో దిగుతోంది భారత జట్టు. శ్రీలంక మాత్రం రెండు మార్పులు చేసింది.  జనిత్ లియనాగే, జఫ్రే వాందేర్సేలను తప్పించి వారి స్థానంలో బినురా ఫెర్నాండో, దనుస్క గుణతిలకలకు జట్టులో అవకాశం ఇచ్చింది లంక. 

అలాగే మొదటి టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్‌తో పాటు ఆరంగ్రేట ప్లేయర్ దీపక్ హుడాలకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. నేటి మ్యాచ్‌లో కూడా భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ఈ ఇద్దరి బ్యాటింగ్ చూసే అవకాశం అభిమానులకు దక్కుతుందా? లేదా? అనేది చూడాలి.

శ్రీలంక జట్టు: పథుమ్ నిశ్శంక, కమిల్ మిశార, చరిత్ అసలంక, ధనుష్క గుణతిలక, దినేశ్ చండిమల్, దసున్ శనక, చమిక కరుణరత్నే, దుస్మంత ఛమీరా, ప్రవీణ్ జయవిక్రమ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార

 భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చాహాల్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !
T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !