INDvsSL 1st T20I: భారత బౌలర్ల జోరు, లంక బెంబేలు... తొలి టీ20లో టీమిండియా ఘన విజయం..

Published : Feb 24, 2022, 10:20 PM ISTUpdated : Feb 24, 2022, 10:24 PM IST
INDvsSL 1st T20I: భారత బౌలర్ల జోరు, లంక బెంబేలు... తొలి టీ20లో టీమిండియా ఘన విజయం..

సారాంశం

India vs Sri Lanka 1st T20I: కెప్టెన్‌గా వరుసగా 10వ విజయం అందుకున్న రోహిత్ శర్మ... మొదటి టీ20 మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం..


INDvsSL 1st T20I:  కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ, వరుసగా పదో విజయాన్ని అందుకున్నాడు. ఫామ్‌లో లేని శ్రీలంక, వరుస విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ సేన జోరును అందుకోలేకపోయింది.  తొలి టీ20 మ్యాచ్‌లో 62 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న 

200 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన లంకకి మొదటి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ పథుమ్ నిశ్శంక, భువీ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో సున్నాకే తొలి వికెట్ కోల్పోయింది లంక...

కమిల్ మిశారా 12 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి భువీ బౌలింగ్‌లో రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా జనిత్ లియనాగే 17 బంతుల్లో 11 పరుగులు చేసి వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

వికెట్ కీపర్ దినేశ్ చండీమల్ 9 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్‌గా అవుట్ కాగా కెప్టెన్ దశున్ శనక 3 పరుగులు చేసి యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

60 పరుగులకే సగం టీమ్ పెవిలియన్ చేరడంతో చమిక కరుణరత్నే, చరిత్ అసలంక కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఆరో వికెట్‌కి 37 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 14 బంతుల్లో 2 సిక్సర్లతో 21 పరుగులు చేసిన కరుణరత్నే, అయ్యర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

భారత ఫీల్డర్లు క్యాచులు వదిలేయడంతో బతికిపోయిన చరిత్ అసలంక 44 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. అసలంక కెరీర్‌లో ఇది మూడో టీ20 హాఫ్ సెంచరీ...  అసలంక 53, చమీరా 24 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది శ్రీలంక జట్టు. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది...ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ కలిసి టీమిండియాకి శతాధిక భాగస్వామ్యాన్ని అందించారు. 

30 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు ఇషాన్ కిషన్. ఆరంగ్రేటం మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్‌కి, ఇది కెరీర్‌లో రెండో టీ20 హాఫ్ సెంచరీ కావడం విశేషం. 

తొలి వికెట్‌కి 111 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కెప్టెన్ రోహిత్ శర్మ, టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ 3299 టీ20 పరుగులతో ఉంటే, అతన్ని అధిగమించిన రోహిత్ శర్మ 3307 పరుగులతో టాప్‌లో నిలిచాడు...

32 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ, లహిరు కుమార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సార్లు బౌల్డ్ అయిన భారత క్రికెటర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ...

రోహిత్ శర్మ 14 సార్లు బౌల్డ్ అయితే శిఖర్ ధావన్ 14 సార్లు, ఎమ్మెస్ ధోనీ 13, సురేష్ రైనా 11, కెఎల్ రాహుల్ 10 సార్లు క్లీన్ బౌల్డ్ అయ్యారు... 


శ్రీలంక ఫీలర్డు క్యాచ్ డ్రాప్ చేయడంతో బతికిపోయిన ఇషాన్ కిషన్, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకుముందు వెస్టిండీస్‌పై 2019లో 65 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రిషబ్ పంత్ రికార్డును బ్రేక్ చేశాడు ఇషాన్ కిషన్...

56 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, దసున్ శనక బౌలింగ్‌లో జనిత్ లియనగేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, ప్రారంభంలో నెమ్మదిగా ఆడినా... ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత జూలు విదిల్చారు. 19వ ఓలర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు రాబట్టిన శ్రేయాస్ అయ్యర్, 20వ ఓవర్‌లో ఓ సిక్సర్, ఫోర్‌తో 16 పరుగులు రాబట్టాడు. 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు శ్రేయాస్ అయ్యర్. అయ్యర్ ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి 3 ఓవర్లలో 44 పరుగులు రాబట్టింది భారత జట్టు... 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !