INDvsNZ: ఆగిన వాన.. టాస్ గెలిచిన న్యూజిలాండ్.. మొదట బౌలింగ్ చేయనున్న భారత్

By Srinivas MFirst Published Nov 22, 2022, 12:08 PM IST
Highlights

INDvsNZ T20I: వర్షం కారణంగా కాస్త ఆలస్యమైన   మ్యాచ్ లో  న్యూజిలాండ్ టాస్ గెలిచి  తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.  భారత జట్టు బౌలింగ్ కు రానుంది. 
 

ప్రపంచకప్ తర్వాత తొలి  టీ20 సిరీస్ నెగ్గేందుకు యువ భారత జట్టు  ఉవ్విళ్లూరుతున్నది.  వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దైనా రెండో మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక నేపియర్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా టాస్  ఓడి తొలుత  బౌలింగ్ చేయనుంది. సిరీస్ విజయం మీద కన్నేసిన టీమిండియా ఈ మ్యాచ్ లో ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నది. ఇక రెండో మ్యాచ్ ఓడి సిరీస్ కోల్పోయే ప్రమాదంలో ఉన్న కివీస్.. సారథి కేన్ విలియమ్సన్ లేకుండానే  ఆడుతన్నది. ఈ మ్యాచ్ లో టిమ్ సౌథీ  కివీస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.  కేన్ మామ స్థానంలో మార్క్ చాప్మన్  ఆడుతున్నాడు. 

భారత జట్టు ఈ మ్యాచ్ లో  వాషింగ్టన్ సుందర్ స్థానంలో  హర్షల్ పటేల్ కు అవకాశమిచ్చింది. సంజూ శాంసన్, ఉమ్రాన్ మాలిక్ లకు ఈ మ్యాచ్ లో కూడా అవకాశం రాలేదు.

 నేపియర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు పొంచే ఉన్నది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇక్కడ వర్షం కురిసింది. వాన కారణంగా టాస్ ఆలస్యమైనా  మ్యాచ్  సజావుగా సాగే అవకాశముందని తెలుస్తున్నది. 

గత మ్యాచ్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ నేటి మ్యాచ్ లో కూడా  మెరవాలని టీమిండియా కోరుకుంటున్నది. సూర్యతో పాటు బౌలర్లు కూడా స్థాయికి తగ్గట్టు రాణిస్తే  టీమిండియా ఖాతాలో మరో టీ20 సిరీస్ చేరడం ఖాయం. 

తుది జట్లు :

టీమిండియా :   రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్,  మహ్మద్ సిరాజ్ 

న్యూజిలాండ్ :  ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్  చాప్మన్, జేమ్స్ నీషమ్,  మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్
 

click me!