INDvsNZ: టాస్ ఆలస్యం.. మూడో టీ20కి వర్షం ముప్పు..

Published : Nov 22, 2022, 11:49 AM IST
INDvsNZ: టాస్ ఆలస్యం.. మూడో టీ20కి వర్షం ముప్పు..

సారాంశం

INDvsNZ T20I: రెండో టీ20లో ఘన విజయం అనంతరం భారత జట్టు నేడు నేపియర్ లో మూడో  మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకునేందుకు సిద్ధమైంది. అయితే వాతావరణం మాత్రం ఇందుకు అనుకూలంగా లేదు.   

ప్రపంచకప్ తర్వాత తొలి  టీ20 సిరీస్ నెగ్గేందుకు యువ భారత జట్టు  ఉవ్విళ్లూరుతున్నది.  వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దైనా రెండో మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇక నేపియర్ వేదికగా జరుగాల్సి ఉన్న మూడో  మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్సం కారణంగా ఇరు జట్ల కెప్టెన్లు ఇంకా టాస్ కు రాలేదు.  అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో టాస్ ఆలస్యమవుతున్నది. ప్రస్తుతం పిచ్ మీద కవర్లు వేసే ఉంచారు. వర్షం ఆగిపోయినా అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటం.. ఇంకా చిరుజల్లులు కురుస్తుండటంతో  మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనేది అనుమానంగా ఉంది. 

గత మ్యాచ్ లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ నేటి మ్యాచ్ లో కూడా  మెరవాలని టీమిండియా కోరుకుంటున్నది. సూర్యతో పాటు బౌలర్లు కూడా స్థాయికి తగ్గట్టు రాణిస్తే  టీమిండియా ఖాతాలో మరో టీ20 సిరీస్ చేరడం ఖాయం. 

 

తుది జట్లు అంచనా :
టీమిండియా :   రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్,  మహ్మద్ సిరాజ్ 

న్యూజిలాండ్ :  ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్  చాప్మన్, జేమ్స్ నీషమ్,  మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), ఆడమ్ మిల్నే, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?