సుందర్ సూపర్ క్యాచ్.. కివీస్‌ను కట్టడి చేసిన చెన్నై చిన్నోడు..

Published : Jan 27, 2023, 08:07 PM IST
సుందర్ సూపర్ క్యాచ్.. కివీస్‌ను కట్టడి చేసిన చెన్నై చిన్నోడు..

సారాంశం

INDvsNZ T20I Live: ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న  తొలి టీ20లో  టాస్ గెలిచి బౌలింగ్ కు వచ్చిన  భారత  పేసర్లను కివీస్ బ్యాటర్లు దంచికొడుతుంటే  వాషింగ్టన్ సుందర్  వారికి అడ్డుకట్ట వేశాడు. 

రాంచీ వేదికగా ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న  తొలి టీ20లో  భారత జట్టు   స్పిన్ ఆల్ రౌండర్  వాషింగ్టన్ సుందర్  స్టన్నింగ్ క్యాచ్ తో   ఆకట్టుకున్నాడు.  తన రెండో ఓవర్లో    కివీస్ బ్యాటర్ మార్క్ చాప్‌మన్ ను అద్భుత క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు.  అంతకుముందు  కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ కూడా  భారత పేస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగగా అతడిని కూడా  సుందర్  ఔట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన కివీస్  ఇన్నింగ్స్ ను ఓపెనర్ ఫిన్ అలెన్ (23 బంతుల్లో 35, 4 ఫోర్లు, 2 సిక్సర్లు)   దూకుడుగా ఆరంభించాడు. హార్ధిక్ పాండ్యా వేసిన  తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు బాదిన అతడు..  అర్ష్‌దీప్ బౌలింగ్ లో  మరో బౌండరీ బాదాడు. అతడే వేసిన  నాలుగో ఓవర్లో  ఓ భారీ సిక్సర్ తో పాటు ఫోర్ కొట్టాడు. 

పేసర్లు విఫలమవడంతో  హార్ధిక్.. బంతిని స్పిన్నర్ చెన్నై చిన్నోడు వాషింగ్టన్ సుందర్ కు  ఇచ్చాడు. అతడు వేసిన  ఐదో ఓవర్ తొలి బంతికి  అలెన్ భారీ సిక్సర్ బాదాడు. కానీ  రెండో బంతికి   అలాగే ఆడబోయి బౌండరీ లైన్ వద్ద ఉన్న సూర్యకుమార్ యాదవ్ కు చిక్కాడు.  అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన  చాప్‌మన్ (0).. సుందర్ బౌలింగ్ ను ఎదుర్కోవడానికి ఇబ్బందిపడ్డాడు. 

 

నాలుగు బంతులు ఎదుర్కున్న  చాప్‌మన్..  ఆ ఓవర్లో చివరి బంతిని  ఆఫ్ సైడ్ పుష్ చేయబోయాడు.   బౌలింగ్ ఎండ్ లో ఉన్న  సుందర్.. ముందుకు డైవ్ చేస్తూ  స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.  మరీ స్టాండింగ్ పొజిషిన్ కాకపోయినా  బౌలింగ్ చేసే ఎండ్ నుంచి ముందుకు  డైవ్ చేస్తూ సుందర్ పట్టిన క్యాచ్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.   13 వ ఓవర్లో కుల్దీప్ యాదవ్.. గ్లెన్ ఫిలిప్స్ (17) ను ఔట్ చేశాడు. 

సుందర్ డబుల్ బ్రేక్ తో   కివీస్ దూకుడుకు కాస్త బ్రేక్ పడింది.  అలెన్ స్థానంలో  డెవాన్ కాన్వే బాదుతున్నాడు.  ఉమ్రాన్ మాలిక్ వేసిన  8వ ఓవర్  లో కాన్వే రెండు ఫోర్లు, ఓ భారీ సిక్సర్ బాదాడు.  ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి  కివీస.. 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.  కాన్వే (47 నాటౌట్), మిచెల్ (9) లు క్రీజులో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Smriti Mandhana: ఔను.. నా పెళ్లి రద్దయింది.. స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్ సంచలన పోస్టులు
IND vs SA : జైస్వాల్ తొలి సెంచరీ.. విశాఖలో సౌతాఫ్రికా చిత్తు