సిరీస్ నిలవాలంటే గెలవాల్సిందే.. రెండో టీ20లో టాస్ గెలిచిన కివీస్..

Published : Jan 29, 2023, 06:35 PM IST
సిరీస్ నిలవాలంటే గెలవాల్సిందే.. రెండో టీ20లో టాస్ గెలిచిన కివీస్..

సారాంశం

INDvsNZ 2nd T20I: ఇండియా-న్యూజిలాండ్ మధ్య లక్నో వేదికగా జరుగుతున్న రెండో టీ20లో  మిచెల్ శాంట్నర్  సారథ్యంలోని కివీస్ టాస్ నెగ్గి  తొలుత   బ్యాటింగ్ కు రానుంది. 

న్యూజిలాండ్ ను వన్డే సిరీస్ లో ఓడించిన టీమిండియా  ఇటీవలే రాంచీ వేదికగా  ముగిసిన తొలి టీ20లో మాత్రం ఆ జోరు చూపించలేకపోయింది.   తొలుత బౌలింగ్ లో విఫలమైన  భారత జట్టు తర్వాత బ్యాటింగ్ లో కూడా విఫలమైంది.  ఈ నేపథ్యంలో  నేడు లక్నో వేదికగా జరుగబోయే  రెండో టీ20లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి.   ఈ మ్యాచ్ లో  టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్‌కు రానుంది. 

లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి  ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో టీ20లో  భారత జట్టులో ఒక మార్పు చోటు  చేసుకుంది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో  యుజ్వేంద్ర చాహల్ టీమ్ లోకి వచ్చాడు. భారత్ ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లు (కుల్దీప్ యాదవ్) లతో బరిలోకి దిగుతున్నది.  కివీస్ మాత్రం తొలి మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టుతోనే ఆడుతోంది. 

రాంచీలో  అటు బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా విఫలమైన టీమిండియా..  ఈ మ్యాచ్ లో నెగ్గకుంటే  సిరీస్ సైతం కోల్పోయే ప్రమాదంలో పడుతుంది.  మరి ఈ నేపథ్యంలో  హార్ధిక్ పాండ్యా అండ్ కో. ఏం చేస్తుందో చూడాలి. 

తుది జట్లు : 

భారత్ : ఇషాన్ కిషన్, శుభమన్ గిల్, రాహుల్ త్రిపాఠి,   సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా,  వాషింగ్టన్ సుందర్,  శివమ్ మావి,  కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్

న్యూజిలాండ్ :  ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్  శాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రాస్‌వెల్, జాకబ్ డఫ్ఫీ,  ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్, బ్లయర్ టిక్నర్ 

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది