
టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రెండు మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన ఓడిన ఇంగ్లాండ్ జట్టు నేటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేయనుంది. తొలి రెండు మ్యాచుల్లో నెగ్గిన భారత జట్టు, ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. మిగిలిన మూడో టీ20లో గెలిచి పరువు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది ఇంగ్లాండ్ జట్టు...
కెప్టెన్‌గా వరుసగా 19 మ్యాచులు గెలిచిన రోహిత్ శర్మ, నేటి మ్యాచ్‌లో విజయం సాధిస్తే వరుసగా అత్యధిక విజయాలు అందుకున్న సారథిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేస్తాడు.
మొదటి రెండు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసి, ఆ లక్ష్యాన్ని కాపాడుకుంటూ అద్భుత విజయాలు అందుకుంది టీమిండియా. భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అదిరిపోయే పర్ఫామెన్స్‌తో దుమ్మురేపుతున్నాడు. అతనికి తోడు హార్ధిక్ పాండ్యా కూడా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు...
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ ప్రదర్శన అత్యంత కీలకంగా మారింది. రెండో టీ20లో కేవలం 1 పరుగు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, నేటి మ్యాచ్‌లో సరిగ్గా ఆడకపోతే టీ20 జట్టులో అతని చోటు ప్రశ్నార్థకంగా మారవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి...
ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో విరాట్ కోహ్లీని ఆడించడమే అనవసరమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు చాలామంది మాజీ క్రికెటర్లు. నేటి మ్యాచ్‌లో ఫెయిల్ అయితే విరాట్ కోహ్లీపై ట్రోలింగ్ మరింత ఎక్కువవుతాయి...
నేటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రెండు ఫోర్లు బాదితే, టీ20ల్లో 300 ఫోర్లు బాదిన రెండో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. రెండో టీ20లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించి, విరాట్ కోహ్లీ కంటే ముందున్నాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి రెండు టీ20ల్లో మెరుపు ఆరంభాలు అందించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. అప్పుడెప్పుడో గత ఏడాది నవంబర్‌లో న్యూజిలాండ్ జరిగిన టీ20 సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, ఆ తర్వాత ఇప్పటివరకూ అర్ద శతకం కొట్టలేకపోయాడు.. రెండో టీ20లో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్... మంచి పర్పామెన్స్ ఇచ్చాడు...
మూడో టీ20లో నాలుగు మార్పులతో బరిలో దిగుతోంది భారత జట్టు. హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, యజ్వేంద్ర చాహాల్, భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్, రవి భిష్ణోయ్, శ్రేయాస్ అయ్యర్‌లకు తుదిజట్టులో చోటు దక్కింది..
భారత జట్టు: రోహిత్ శర్మ, రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, రవి భిష్ణోయ్
ఇంగ్లాండ్ జట్టు: జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలాన్, ఫిలిప్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, హారీ బ్రూక్, మొయిన్ ఆలీ, డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్, రీస్ తోప్లే, రిచర్డ్ గ్లీసన్