రోహిత్‌ను ఘోరంగా అవమానించిన హార్ధిక్ పాండ్యా... నేను బౌలింగ్ చేస్తుంటే నా మాటే వినాలంటూ బూతులు...

Published : Jul 10, 2022, 05:51 PM ISTUpdated : Jul 10, 2022, 05:52 PM IST
రోహిత్‌ను ఘోరంగా అవమానించిన హార్ధిక్ పాండ్యా... నేను బౌలింగ్ చేస్తుంటే నా మాటే వినాలంటూ బూతులు...

సారాంశం

ట్విట్టర్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతున్న ‘#HardikAbusedRohit’ హ్యాష్ ట్యాగ్... రెండో టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మను హార్ధిక్ అవమానించాడంటూ వీడియో వైరల్.. 

ఐపీఎల్ 2022 సీజన్‌తో టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత జట్టులో చోటు కోల్పోయిన హార్ధిక్ పాండ్యా, ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. బ్యాట్స్‌మెన్‌గా, బౌలర్‌గా, ఫీల్డర్‌గానే కాకుండా తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు... 


ఐపీఎల్ 2022 తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, ఐర్లాండ్ టూర్‌లో కెప్టెన్‌గా వ్యవహరించి సిరీస్‌ గెలిచాడు... అయితే తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మరోసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతున్న హార్ధిక్ పాండ్యా... కెప్టెన్‌ని ఘోరంగా అవమానించడం టీవీల్లో రికార్డైంది...

హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న ఓ ప్లేయర్‌, చెప్పిన మాట వినకుండా ప్రవర్తించడంతో అతనిపై అరిచాడు.. ఎన్నిసార్లు చెప్పినా ఫీల్డ్ పొజిషన్ మార్చుకోకపోవడంతో... ‘నేను బౌలింగ్ చేస్తున్నప్పుడు నన్ను చూడు, నేను చెప్పింది విను... వాడు ముంచేస్తాడు (బూతు పదంతో)... ’ అంటూ హార్ధిక్ పాండ్యా చేసిన కామెంట్లు, టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 

ఈ వీడియో వైరల్ కావడంతో ట్విట్టర్‌లో ‘#HardikAbusedRohit’ దేశవ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్ అవుతోంది. 2015లో ముంబై ఇండియన్స్‌లోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా, ముంబై ఇండియన్స్ నాలుగు టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. హార్ధిక్ పాండ్యా లేకుండా ఐపీఎల్ 2022 సీజన్ బరిలో దిగిన ముంబై ఇండియన్స్, సీజన్ చరిత్రలో మొట్టమొదటిసారి 10 మ్యాచుల్లో ఓడి ఆఖరి పొజిషన్‌లో నిలిచి చెత్త ప్రదర్శన నమోదు చేసింది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ రిటెన్షన్‌లో తనకు చోటు దక్కకపోవడంపై హార్ధిక్ పాండ్యా బాగా హార్ట్ అయ్యాడని, అందుకే రోహిత్ శర్మపై కోపంగా ఉన్నాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఎంత కోపంగా ఉన్నా హార్ధిక్ పాండ్యాకి తుదిజట్టులో అవకాశం రావడానికి, టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి రోహిత్ శర్మనే కారణం...

తనకి క్రికెటర్‌గా లైఫ్ అందించిన రోహిత్ శర్మను రిటైన్ చేసుకోలేదని కారణంగా ఈ విధంగా బూతులు తిట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం హార్ధిక్ పాండ్యా చేసిన పనికి సంతోషపడుతూ ట్వీట్లు చేస్తున్నారు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ గెలిచి, హార్ధిక్ పాండ్యా, రోహిత్ కంటే మెరుగైన కెప్టెన్‌ని అని నిరూపించుకున్నాడని, అలాంటప్పుడు ఫీల్డర్లను ఎక్కవ పెట్టాలో అతనికి తెలీదా... అంటూ ఆల్‌రౌండర్ చేసిన పనికి సపోర్ట్ చేస్తున్నారు. 

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 33 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, బౌలింగ్‌లో 4 ఓవర్లలో 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఒకే మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు హార్ధిక్ పాండ్యా...

రెండో టీ20లో బ్యాటింగ్‌లో 12 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, బౌలింగ్‌లో ఒకే వికెట్ తీయగలిగాడు. ఎలా చూసినా రోహిత్ శర్మ కెప్టెన్సీలో మరో రెండుమూడేళ్లు టీమిండియాలో ఆడాల్సి ఉంటుంది హార్ధిక్ పాండ్యా. అంతెందుకు టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో హార్ధిక్ పాండ్యాని ఆడించాలా? వద్దా? అనేది కూడా రోహిత్ శర్మనే డిసైడ్ చేయబోతున్నాడు. ఈ విషయాలు గుర్తుంచుకుని హార్ధిక్ పాండ్యా కాస్త నిగ్రహంగా ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్... 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు