పోలీస్ శాఖకు స్టార్ రెజ్లర్ పోగట్ దూరం... రాజకీయాలకు దగ్గరయ్యేందుకే

By Arun Kumar PFirst Published Sep 13, 2019, 5:59 PM IST
Highlights

ఇటీవలే బిజెపి పార్టీలో చేరిన రెజ్లింగ్ స్టార్ బబితా పోగట్ తన పోలీస్ ఉద్యోగానికి రాాజీనామా చేశారు. డిల్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.   

భారత స్టార్ రెజ్లర్ బబితా పోగట్ ఇటీవలే రాజకీయ రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజు సమక్షంలోనే భారతీయ జనతా పార్టీలో చేరిన ఈ 29ఏళ్ల రెజ్లింగ్ ఛాంపియన్ డిల్లీ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్దమయ్యారు. ఇందుకోసం పోలీస్ శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి బబితా రాజీనామా చేసినట్లు సమాచారం. ఈ రాజీనామాను తాజాగా హర్యానా పోలీసులు కూడా దృవీకరించారు. 

గతంలో కామన్వెల్త్ క్రీడల్లో అదరగొట్టడం ద్వారా బబిత పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రతిష్టాత్మక క్రీడల్లో పతకం సాధించిన ఆమె యావత్ దేశ ప్రజల నుండి ప్రశంసలు పొందారు. అలాగే కేంద్రం ఆమె ప్రతిభను గుర్తించి దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ తో సత్కరించింది. ఇలా రెజ్లింగ్ లో అదరగొట్టిన బబిత ఇక రాజకీయాల్లో తన సత్తాను నిరూపించుకోడానికి సిద్దమయ్యారు.   

తన తండ్రితో మహవీర్ పోగట్ తో కలిసి బబిత ఇటీవలే బిజెపిలో చేరారు. డిల్లీలోని బిజెపి కార్యాలయంలో ఇటీవలే జరిగిన ఈ చేరిక కార్యక్రమంలో మహవీర్ మాట్లాడుతూ...బిజెపి పార్టీ విదివిధానాలు తరకెంతో నచ్చడం వల్లే  పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై ఆయన ప్రశంసలు కురిపించారు. 

హర్యానాకు చెందిన పోగట్ ప్యామిలీ మొత్తం రెజ్లింగ్ క్రీడాకారులే. తండ్రి మహవీర్ ప్రోత్సాహంతో బబితా పోగట్ తో పాటు ఆమె ఇద్దరు సోదరీమణులు కూడా అంతర్జాతీయ స్థాయి రెజ్లింగ్ లో రాణించారు. వీరి కుటుంబ నేపథ్యం  ఇతివృత్తంగానే 2016లో దంగ‌ల్ సినిమా రూపొంది బాలీవుడ్ సినిమా ఇంండస్ట్రీని షేక్ చేసింది.

click me!