ఢిల్లీ క్యాపిటల్స్ లో కరోనా కలవరం

By telugu news teamFirst Published Sep 7, 2020, 11:37 AM IST
Highlights

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్‌ కరోనా బారిన పడ్డాడు. దుబాయ్‌కు చేరుకున్నాక అతనికి నిర్వహించిన తొలి రెండు కోవిడ్‌–19 పరీక్షలు నెగెటివ్‌ రాగా... మూడో పరీక్షలో మాత్రం అతనికి పాజిటివ్‌ వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఆదివారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.

క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 త్వరలో ప్రారంభం కానుంది. కాగా.. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకముందే ఆటంకాలు మొదలౌతున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా వైరస్ కలకలం మొదలైంది. తాజాగా..  ఇదే సమస్య ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కి వచ్చి పడింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్‌ కరోనా బారిన పడ్డాడు. దుబాయ్‌కు చేరుకున్నాక అతనికి నిర్వహించిన తొలి రెండు కోవిడ్‌–19 పరీక్షలు నెగెటివ్‌ రాగా... మూడో పరీక్షలో మాత్రం అతనికి పాజిటివ్‌ వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఆదివారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.

అయితే కరోనా సోకిన ఫిజియోథెరపిస్ట్‌ ఇప్పటి వరకు జట్టు సభ్యులతో, ఫ్రాంచైజీ అధికారులతో కలవలేదని... అతను నిబంధనల ప్రకారం దుబాయ్‌లోని ఐపీఎల్‌ ఐసోలేషన్‌ కేంద్రంలో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటాడని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం తెలిపింది. ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు చెందిన 13 మంది వ్యక్తులకు, బీసీసీఐ మెడికల్‌ జట్టులోని సభ్యుడికి కరోనా సోకింది

click me!