బోల్డ్ లుక్ లో షాకిచ్చిన షమీ భార్య.. నెటిజన్ల ట్రోల్స్

Published : Aug 20, 2021, 11:54 AM IST
బోల్డ్ లుక్ లో షాకిచ్చిన షమీ భార్య.. నెటిజన్ల ట్రోల్స్

సారాంశం

 హసీన్‌ బుధవారం ఇన్‌స్టాలో ఓ బోల్డ్‌ ఫోటో షేర్‌ చేశారు. దీనిలో హసీన్‌ తెలుపు రంగు రగ్గడ్‌ జీన్స్‌, బ్లాక్‌ టాప్‌ ధరించి ఉన్నారు.

టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. గతంలో.. షమీపై సంచలన ఆరోపణలు చేసి షమీ గతంలో రచ్చ రచ్చ చేసిన ఆమె.. ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలతో హాట్ టాపిక్ గా మారింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో బోల్డ్ ఫోటోలను షేర్ చేశారు.

ఆ ఫోటో చూసి కొందరు ఆమె చాలా అందంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తుండగా.. కొందరు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తుండటం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్‌లో హసీన్‌ జహాన్‌కు లక్షమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో హసీన్‌ బుధవారం ఇన్‌స్టాలో ఓ బోల్డ్‌ ఫోటో షేర్‌ చేశారు. దీనిలో హసీన్‌ తెలుపు రంగు రగ్గడ్‌ జీన్స్‌, బ్లాక్‌ టాప్‌ ధరించి ఉన్నారు.

 ఈ క్లోజప్‌ ఫోటోలో హసీన్‌ కాస్త బోల్డ్‌గా దర్శనిమిచ్చారు. ఇది కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక ఈ ఫోటో చూసిన కొందరు హసీన్‌ చాలా అందంగా ఉన్నారు అని ప్రశంసించగా.. చాలా మంది మాత్రం దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. పెళ్లై ఓ బిడ్డకు తల్లివి అయ్యావ్‌.. అయినా కూడా ఇంత ఎక్స్‌పోజింగ్‌ అవసరమా అంటూ మండిపడుతున్నారు.


 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు