భారత ప్రభుత్వం నుంచి బీసీసీఐకి స్పెషల్ రిక్వెస్ట్... 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా...

Published : Jul 10, 2022, 05:05 PM IST
భారత ప్రభుత్వం నుంచి బీసీసీఐకి స్పెషల్ రిక్వెస్ట్... 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా...

సారాంశం

స్వాతంత్య్ర దినోత్సవ 75వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా టీమిండియాకి, వరల్డ్ ఎలెవన్‌కీ మధ్య మ్యాచ్... బీసీసీఐకి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన..

200 ఏళ్లకు పైగా ఆంగ్లేయుల బానిస సంకెళ్ల కింద బతికిన భారతావనికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయ్యాయి. 75వ సిల్వర్ జూబ్లీ వార్షిక వేడుకల కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది భారత ప్రభుత్వం. ఇందులో భాగంగా భారత జట్టుకీ, మిగిలన దేశాల ప్లేయర్లతో కూడా రెస్ట్ ఆఫ్ ఇండియా టీమ్‌కి మధ్య ఓ స్పెషల్ మ్యాచ్ నిర్వహించాలని భావిస్తోందట భారత ప్రభుత్వం...

భారత సంస్కృతిక శాఖ నుంచి భారత క్రికెట్ బోర్డుకి ఈ మ్యాచ్‌కి సంబంధించిన రిక్వెస్ట్ వచ్చిందని సమాచారం. ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ క్యాంపెయిన్‌లో భాగంగా భారత స్టార్ ప్లేయర్లతో కూడిన జట్టుకీ, మిగిలిన దేశాల ప్లేయర్లతో నిండిన ‘రెస్ట్ ఆఫ్ ఇండియా’ టీమ్‌కి ఆగస్టు 22న మ్యాచ్ నిర్వహించాలనే ప్రతిపాదన, బీసీసీఐ అధికారులకు అందినట్టు వార్తలు వస్తున్నాయి...

భారత్‌లో క్రికెట్‌కి బీభత్సమైన క్రేజ్ ఉంది. జాతీయ క్రీడగా హాకీ పేరు ప్రచారంలో ఉన్నప్పటికీ, ఆ ఆటను అభిమానించే వారి సంఖ్య రోజురోజుకీ పడిపోతూ ఉంది. ఆంగ్లేయులు వెళుతూ వెళుతూ అంటించిన క్రికెట్‌కి ఇక్కడ బీభత్సమైన క్రేజ్ ఏర్పడి, వేల కోట్ల మార్కెట్‌గా మారింది...

అందుకే స్వాతంత్య్ర వేడుకల్లో క్రికెట్ మ్యాచ్‌ని భాగం చేస్తే, జనాల నుంచి విపరీతమైన స్పందన వస్తుందనే ఆలోచనలో ఉందట కేంద్రం. ఐపీఎల్ 2023-27 ప్రసార హక్కుల విక్రయం ద్వారా భారత క్రికెట్ బోర్డుకి రూ.48 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది...

‘కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండియా ఎలెవన్‌కీ, వరల్డ్ ఎలెవన్‌కీ మధ్య ఆగస్టు 22న క్రికెట్ మ్యాచ్ నిర్వహించాల్సిందిగా ప్రతిపాదన వచ్చింది. వరల్డ్ ఎలెవన్ టీమ్ కోసం 13 నుంచి 14 మంది ప్లేయర్లు కావాలి. ఆ సమయంలో వివిధ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండడంతో ఎంత మంది ప్లేయర్లు అందుబాటులో ఉంటారో చూడాలి...’ అంటూ ఓ బీసీసీఐ అధికారి తెలియచేశాడు.. 

ఆలోచన బాగానే ఉంది కానీ ఈ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడితే పరిస్థితి ఏంటి? స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భారత జట్టు ఓడితే, అది మొదటికే మోసం తెస్తుంది... ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో టీ20 సిరీస్, వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టు, ఆ తర్వాత వెస్టిండీస్ టూర్‌కి పయనం కానుంది...

వరల్డ్ ఎలెవన్ వర్సెస్ టీమిండియా ఎలెవన్ మ్యాచ్ నిర్వహించాలని ప్రతిపాదన వచ్చిన ఆగస్టు 22న వెస్టిండీస్‌తో మొదటి వన్డే మ్యాచ్ ఆడనుంది బీసీసీఐ. ఈ మ్యాచ్‌కి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా వంటి సీనియర్లు ప్లేయర్లు అందరూ దూరంగా ఉంటున్నారు... ఒకవేళ ఇండియాలో ఈ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంటే, ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత కోహ్లీ, బుమ్రా, రోహిత్ అండ్ కో... స్వదేశానికి రావాల్సి ఉంటుంది.

శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆడే టీమిండియా, జూన్ 22, జూన్ 24, 27 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత జరిగే టీ20 సిరీస్‌లో రోహిత్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ అండ్ కో పాల్గొనబోతున్నారు.

PREV
click me!

Recommended Stories

T20 World Cup: దటీజ్ ఇషాన్ కిషన్.. వరల్డ్ కప్ జట్టులో చోటు కోసం ఏం చేశాడో తెలుసా?
T20 World Cup: భారత జట్టులో శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్.. అసలు కారణం ఇదే !