వేసింది నాలుగు ఓవర్లు.. ఇచ్చింది 82 పరుగులు.. టీ20 క్రికెట్ లో ఇంగ్లాండ్ బౌలర్ చెత్త రికార్డు..

Published : Jul 10, 2022, 03:36 PM IST
వేసింది నాలుగు ఓవర్లు.. ఇచ్చింది 82 పరుగులు.. టీ20 క్రికెట్ లో ఇంగ్లాండ్ బౌలర్ చెత్త రికార్డు..

సారాంశం

T20 Blast 2022: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్  లో అదే దేశానికి చెందిన ఓ బౌలర్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. సదరు బౌలర్ 4 ఓవర్లు వేసి 82  పరుగులిచ్చాడు. 

ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో భాగమైన డెర్బీషైర్-సోమర్సెట్ మధ్య శనివారం జరిగిన ఓ మ్యాచ్ ప్రపంచ రికార్డుకు వేదికైంది.  డెర్బీషైర్ బౌలర్ మాట్  మెకరైన్.. టీ20 లలో అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. సోమర్సెట్  బ్యాటర్ల దాటికి అతడు ఏకంగా నాలుగు ఓవర్లలోనే 82 పరుగులు సమర్పించుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో నాలుగు ఓవర్ల కోటా వేసి ఇన్ని పరుగులు ఇచ్చుకున్న బౌలర్ మెకరైన్ మాత్రమే. 

టీ20 బ్లాస్ట్ లో భాగంగా శనివారం డెర్బీషైర్-సోమర్సెట్  మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సోమర్సెట్.. డెర్బీషైర్ బౌలర్ల దుమ్ము దులిపింది. ఈ క్రమంలో  బాధితుడిగా నిలిచాడు మెకరైన్. 

ఈ మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసిన అతడు.. ఏకంగా 20.5 ఎకానమీ తో  82 పరుగులిచ్చాడు. ఒక ఓవర్లో ఏకంగా 34 పరుగులు ఇచ్చుకున్నాడు. తద్వారా గతంలో నాలుగు ఓవర్ల కోటా బౌలింగ్ చేసి అత్యధిక పరుగులు ఇచ్చుకున్న పాకిస్తాన్ బౌలర్ సర్మద్ అన్వర్ (81 పరుగులు) రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.  2011లో సూపర్‌ ఎలైట్‌ టీ20 కప్‌లో భాగంగా అన్వర్‌ నాలుగు ఓవర్లు వేసి 81 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు మెకరైన్.. అన్వర్ కంటే ఒక్క పరుగు ఎక్కువే ఇచ్చాడు. 

 

ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే సోమర్సెట్ జట్టులో బాంటన్ 41 బంతుల్లో 73 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ రోసోవ్ 36 బంతుల్లో 93 పరుగులు  సాధించాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉండటం గమనార్హం. ఈ మ్యాచ్ లో మెకరైన్ వేసిన ఒక ఓవర్లో రోసోవ్.. 34 పరుగులు పిండుకున్నాడు. వీళ్లిద్దరూ దంచికొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో సోమర్సెట్ 5 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. 

 

అనంతరం బ్యాటింగ్ చేసిన డెర్బిషైర్.. 74 పరుగులకే కుప్పకూలింది.  భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డెర్బిషైర్.. 11.2 ఓవర్లకే చాపచుట్టేసింది. ఆ జట్టులో వేన్ మడ్సేన్ (17) టాప్ స్కోరర్ గా నిలిచాడు.  సోమర్సెట్ బౌలర్లలో పీటర్ సిడిల్, బెన్ గ్రీన్ లు తలో మూడు వికెట్లు తీశారు. ఫలితంగా సోమర్సెట్ 191 పరుగుల తేడాతో విజయం సాధించింది. 
 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు