విక్రమ్ ‘కోబ్రా’కి స్పెషల్ అట్రాక్షన్‌గా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్... కోలీవుడ్ మూవీలో కీలక రోల్...

Published : Jan 09, 2021, 11:17 AM IST
విక్రమ్ ‘కోబ్రా’కి స్పెషల్ అట్రాక్షన్‌గా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్... కోలీవుడ్ మూవీలో కీలక రోల్...

సారాంశం

విక్రమ్ నటించిన ‘కోబ్రా’ మూవీ టీజర్ విడుదల... ఫస్ట్ షాట్ నుంచి క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌పై స్పెషల్ ఫోకస్... మ్యాన్లీ లుక్స్‌తో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా మారిన మాజీ ఆల్‌రౌండర్...

టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి భారత పేసర్ ఇర్ఫాన్ పఠాన్. స్పిన్నర్ హర్భజన్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా భారత జట్టుకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన ఇర్ఫాన్ పఠాన్... భారత జట్టు తరుపున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20 మ్యాచులు ఆడి, 2700లకు పైగా పరుగులు, 300లకు పైగా వికెట్లు పడగొట్టాడు.

ఫామ్ కోల్పోయి భారత జట్టుకి దూరమైన ఇర్ఫాన్ పఠాన్... 2012లో చివరి వన్డే ఆడాడు. 8 ఏళ్ల తర్వాత 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఇర్ఫాన్ పఠాన్. క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన ఇర్ఫాన్ పఠాన్, విక్రమ్ హీరోగా రూపొందుతున్న ‘కోబ్రా’ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా టీజర్ నేడు విడుదలైంది. టీజర్ మొదటి షాట్ నుంచి ఆఖరి దాకా ఇర్ఫాన్ పఠాన్‌ను హైలెట్ చేసింది చిత్ర బృందం. పర్ఫెక్ట్ లుక్స్‌తో సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా మారాడు ఇర్ఫాన్ పఠాన్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టైతే ఇర్ఫాన్ పఠాన్, నటుడిగా బిజీ అయ్యే అవకాశం ఉంది.

 

 

PREV
click me!

Recommended Stories

IPL 2026 Auction: చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కెచ్.. రూ. 43 కోట్లతో ఆ ఆటగాళ్లపై కన్నేసిన సీఎస్కే !
IPL Mini Auction చరిత్రలో అత్యంత ఖరీదైన 6 ఆటగాళ్లు వీరే.. రికార్డులు బద్దలవుతాయా?