రిషబ్ పంత్, ఆ వెంటనే పూజారా... వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

Published : Jan 09, 2021, 08:43 AM ISTUpdated : Jan 09, 2021, 08:45 AM IST
రిషబ్ పంత్, ఆ వెంటనే పూజారా... వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా...

సారాంశం

174 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న ఛతేశ్వర్ పూజారా.. 36 పరుగులు చేసిన రిషబ్ పంత్... వెంటవెంటనే రెండు వికెట్లు తీసిన ఆస్ట్రేలియా...

సిడ్నీ టెస్టులో భారత జట్టు వెంటవెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామం తర్వాత ఐదో వికెట్‌కి 53 పరుగులు జోడించారు ఛతేశ్వర్ పూజారా, రిషబ్ పంత్. అయితే 67 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన రిషబ్ పంత్, హజల్‌వుడ్ బౌలింగ్‌లో వార్నర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత ఐదు బంతులకు ఛతేశ్వర్ పూజారా కూడా అవుట్ అయ్యాడు. 174 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న ఛతేశ్వర్ పూజారా, తన రికార్డును అధిగమించాడు. టెస్టుల్లో పూజారాకి ఇదే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ. 176 బంతుల్లో 5 ఫోర్లతో 50 పరుగులు చేసిన ఛతేశ్వర్ పూజారా... ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో పైన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

195 పరుగుల వద్దే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఆసీస్ స్కోరుకి ఇంకా 143 పరుగుల దూరంలో ఉంది టీమిండియా. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ క్రీజులో ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?