వర్షంలో తడుస్తూ సచిన్ పోస్ట్... ఏమన్నాడో తెలుసా..?

By Siva KodatiFirst Published Jul 31, 2020, 3:40 PM IST
Highlights

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇండియన్ క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటాడు. తాజాగా సచిన్ ఒక ఫోటోను పంచుకున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇండియన్ క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటాడు. తాజాగా సచిన్ ఒక ఫోటోను పంచుకున్నారు.

ఇందులో ఆయన రెయిన్ కోట్ వేసుకుని వర్షంలో తడుస్తూ.. చిరు జల్లులను ఆస్వాదిస్తుండటాన్ని చూడవచ్చు. కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా సచిన్ ఇంట్లో తన కుటుంబంతో గడుపుతున్నాడు.

మరోవైపు భారత అమ్ముల పొదిలో రాఫెల్ యుద్ధ విమానాలు చేరిన సందర్భంపైనే  సచిన్ స్పందించారు. శత్రు దేశాల గుండెల్లో దడ పుట్టించే రాఫెల్ జెట్ ఫైటర్లకు ఘన స్వాగతమంటూ మాస్టర్ వ్యాఖ్యానించారు.

విశాంత్రి లేకుండా గగనతలం నుంచి మన దేశాన్ని కాపాడుతున్న మన సైనిక బలగాలకు మరింత సామర్ధ్యం వచ్చిందని సచిన్ ఆకాంక్షించారు. క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకరిగా గుర్తింపు పొందిన సచిన్ 1989లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్ట్ ద్వారా టీమిండియాలో ఎంట్రీ ఇచ్చాడు.

200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 24 ఏళ్ల కెరీర్‌లో 53.78 సగటుతో 15,291 పరుగులు చేశాడు. వీటిలో 51 సెంచరీలు, 68 అర్థ సెంచరీలు ఉన్నాయి. 463 వన్డేల్లో 18,426 పరుగులు చేశాడు. వీటిలో 49 సెంచరీలు, 96 అర్థ సెంచరీలు వున్నాయి. వన్డేల్లో తొలిసారిగా డబుల్ సెంచరీ కొట్టిన తొలి క్రికెటర్‌గా 2010లో సచిన్ రికార్డుల్లోకెక్కాడు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#Throwback to a time when all one had to only worry about was rain 🌧️.

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on Jul 30, 2020 at 4:48am PDT

 

click me!