కుల్దీప్ ఆడొచ్చు, ఓపెనర్లుగా రోహిత్, శుబ్‌మన్ గిల్... వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌... - విరాట్ కోహ్లీ...

Published : Feb 04, 2021, 05:23 PM IST
కుల్దీప్ ఆడొచ్చు, ఓపెనర్లుగా రోహిత్, శుబ్‌మన్ గిల్... వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌... - విరాట్ కోహ్లీ...

సారాంశం

శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తారు... వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఆడతాడు... కుల్దీప్ యాదవ్‌కి అవకాశం రావొచ్చు... మీడియా సమావేశంలో భారత సారథి విరాట్ కోహ్లీ...

రేపటి నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఆడబోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మొదటి టెస్టుకి ముందు గురువారం మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మొదటి టెస్టులో భారత తుది జట్టు గురించి కొన్ని విషయాలు చెప్పాడు విరాట్.

ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించిన శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా ఉంటాడని స్పష్టం చేసిన విరాట్ కోహ్లీ... రోహిత్, గిల్ ఓపెనర్లుగా సుదీర్ఘకాలం కొనసాగాల్సి ఉంటుందని చెప్పాడు. శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ భారత జట్టుకి శుభారంభం అందించారని అనుకుంటున్నానని చెప్పిన విరాట్ కోహ్లీ... ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించిన రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేస్తామని స్పష్టం చేశాడు.

ఆస్ట్రేలియా టూర్‌లో బెంచ్‌కే పరిమితమైన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌, మొదటి టెస్టు ఆడే అవకాశం ఉందని చెప్పిన విరాట్ కోహ్లీ... వందో టెస్టు ఆడుతున్న జో రూట్‌కి అభినందనలు తెలిపాడు.

న్యూజిలాండ్ పర్యటనలో, ఆస్ట్రేలియా పర్యటనలో కుల్దీప్ చోటు దక్కించుకోలేదని, ఇప్పుడు స్వదేశంలో టెస్టు సిరీస్ కావడంతో అతనికి ఛాన్స్ దక్కొచ్చని చెప్పాడు కోహ్లీ. అయితే కుల్దీప్ ఉంటాడని మాత్రం కన్ఫార్మ్ చేయలేదు.

PREV
click me!

Recommended Stories

ఒకే ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు.. బుడ్డోడా నువ్వు కేక అసలు.. నెక్స్ట్ టీమిండియాకే
IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే