
భారత సారథి విరాట్ కోహ్లీ క్రీడా స్ఫూర్తిగా చాటుకుని, అభిమానుల మనసు గెలుచుకున్నాడు. తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్, తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అజేయ శతకంతో అదరగొట్టాడు.
వరుసగా 98, 99, 100వ టెస్టుల్లో మూడు సెంచరీలు బాదిన జో రూట్... ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గానూ నిలిచాడు. అయితే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఓ భారీ సిక్సర్ బాదిన జో రూట్... తొడ కండరాలు పట్టేయడంతో నడవడానికి ఇబ్బంది పడుతూ పడిపోయాడు. అప్పుడు అక్కడే ఉన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతనికి సాయం చేశాడు. కాళ్లను లాగుతూ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.
ఇంతకుముందు భారత కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కి ఇలా సాయం చేయగా, ఇప్పుడు కోహ్లీ కూడా మాహీ రూట్‌ను ఫాలో అయ్యాడు. ఈ వీడియోను పోస్టు చేసింది బీసీసీఐ. తొలి రోజు ఆటముగిసే సమయానికి 197 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 128 పరుగులు చేసి అజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు.