వందో టెస్టులో సెంచరీ బాదిన జో రూట్... భారత బౌలింగ్ అట్టర్ ఫ్లాప్...

Published : Feb 05, 2021, 04:04 PM ISTUpdated : Feb 05, 2021, 04:05 PM IST
వందో టెస్టులో సెంచరీ బాదిన జో రూట్... భారత బౌలింగ్ అట్టర్ ఫ్లాప్...

సారాంశం

వందో టెస్టులో సెంచరీ బాదిన ఇంగ్లాండ్ కెప్టెన్... భారత జట్టుపై 8వ సెంచరీ... హషీమ్ ఆమ్లా తర్వాత 100వ టెస్టులో సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు... టెస్టుల్లో వరుసగా మూడో సెంచరీ నమోదుచేసిన జో రూట్...

ఆస్ట్రేలియా పర్యటనలో ఇచ్చిన విజయం నింపిన ఉత్సాహంతో ఘనంగా మొదటి టెస్టు ఆరంభించాలని భావించిన టీమిండియాకు గట్టి షాక్ ఇచ్చింది ఇంగ్లాండ్. స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడుతున్నామనే ధీమాతో ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగిన భారత బౌలింగ్ తొలి రోజు అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

మొదటి సెషన్‌లో రెండు వికెట్లు తీసి, పర్వాలేదనిపించినా... ఆ తర్వాత పూర్తిగా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఆధిక్యమే కనిపించింది. పెద్దగా అనుభవం లేని డొమినిక్ సిబ్లీతో పాటు వందో టెస్టు ఆడుతున్న కెప్టెన్ జో రూట్... మూడో వికెట్‌కి అజేయంగా 164 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ దశంలో జో రూట్ తన కెరీర్‌లో 20వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. జో రూట్ 164 బంతుల్లో 12 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకోగా, డొమినిక్ సిబ్లీ 83 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, షాబజ్ నదీం తేలిపోవడంతో భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది ఇంగ్లాండ్...
 

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?