తొలి టీ20లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి మంచి ఊపులో వున్న టీమిండియా మహిళల జట్టు రెండో టీ20లో మాత్రం ఊసూరుమనిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది.
తొలి టీ20లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి మంచి ఊపులో వున్న టీమిండియా మహిళల జట్టు రెండో టీ20లో మాత్రం ఊసూరుమనిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బ్యాట్స్‌వుమెన్‌లలో దీప్తి శర్మ (31), స్మృతి మంథాన (23), రిచా ఘోష్ (23) , జెమీమా రోడ్రిగ్స్ (13) పరుగులు చేయగా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (6), షఫాలీ వర్మ (1) నిరాశ పరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కిమ్ గార్త్, అనాబెల్ సదర్లాండ్, జార్జియా వేర్‌హామలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఆష్లీన్ గార్డ్‌నర్ ఒక వికెట్ తీశారు.