ENGW vs INDW: పరువు నిలుపుకున్న భారత్ టీం.. చివరి మ్యాచ్‌లో గెలుపు.. సిరీస్ ఇంగ్లాండ్ కైవసం

By Mahesh KFirst Published Dec 11, 2023, 2:04 AM IST
Highlights

ఇంగ్లాండ్, భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఇంగ్లాండ్‌ను చివరి మ్యాచ్‌లో భారత్ కట్టడి చేసింది. ఐదు వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే, సిరీస్ మాత్రం ఇంగ్లాండ్ పరమైంది.
 

ENGW vs INDW: మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ముగిసింది. భారత్, ఇంగ్లాండ్ మహిళా జట్టులు ఈ సిరీస్‌లో భాగంగా తలపడ్డాయి. తొలి రెండు మ్యాచ్‌లలో ఇంగ్లాండ్ జట్టు అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో మ్యాచ్‌తోనే ఇంగ్లాండ్ టీమ్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. భారత్ టీం చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకుంది. చివరి మ్యాచ్‌లోనూ ఇండియా టీం చాలా కష్టంగానే నెగ్గింది. 19వ ఓవర్‌లో భారత్ గెలిచింది. భారత్ టీంలో స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో మెరిశారు. 48 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 48 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచారు. జెమిమా రోడ్రిగ్స్ 33 బంతుల్లో నాలుగు ఫోర్లతో 29 పరుగులు సాధించారు. ఐదు వికెట్ల తేడాతో భారత్ చివరి మ్యాచ్‌లో గెలుపొందడం అభిమానులకు ఊరట ఇచ్చింది.

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు రాణించారు. ఇంగ్లాండ్‌ను తక్కువ స్కోర్ వద్దే కట్టడి చేయగలిగారు. ఇంగ్లాండ్‌ను 126 పరుగులకే ఆలౌట్ చేశారు. హెథర్ నైట్ హాఫ్ సెంచరీ(52 పరుగులు) కొట్టారు. ఆ తర్వాత అమీ జోన్స్ 25 పరుగులు, డీన్ 16 పరుగులు, సోఫీ డంక్లీ 11 పరుగులు సాధించారు. ఆ తర్వాత మిగిలిన బ్యాట్ విమెన్లు సింగిల్ డిజిట్ రన్స్‌కే పెవిలియన్‌కు తిరిగి వెళ్లారు. శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్ చెరో మూడు వికెట్లు, రేణుకా సింగ్, అమన్ జ్యోత్ కౌర్ చెరో రెండు వికెట్లు తీశారు.

Latest Videos

Also Read: BC Bandhu: బీసీ బంధుకు తాత్కాలిక బ్రేక్.. బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు

ఆ తర్వాత స్మృతి మంధాన, షఎఫాలీ వర్మ క్రీజులోకి ఓపెనర్లుగా దిగారు. షెఫాలీ వర్మ మొదట్లోనే వికెట్ సమర్పించుకున్నారు. క్లీన్ బౌల్డ్ కావడంతో పెవిలియన్‌కు వెనుదిరిగారు. తర్వాత క్రీజులోకి వచ్చిన రోడ్రిగ్స్‌తో మంధాన మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరూ నిలకడగా ఆడారు. వీలు చూసుకుని బంతిని బౌండరీకి తరలించారు. అయితే, హాఫ్ సెంచరీకి చెరువ కాగానే స్మృతి ఔట్ అయ్యారు. చివర్లో అమన్ జ్యోత్ కౌర్ రెండు బౌండరీలు సాధించి టీమ్ ఇండియాకు విజయాన్ని సమకూర్చి పెట్టారు.

click me!