రోహిత్ శర్మ ఎఫెక్ట్: విరాట్ కోహ్లీని తిట్టిపోస్తున్న ఫ్యాన్స్

By telugu teamFirst Published Aug 23, 2019, 5:35 PM IST
Highlights

కోహ్లీని ఇడియట్ గా, స్టుపిడ్ గా భారత క్రికెట్ అభిమానులు అభివర్ణిస్తున్నారు. రోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై వారు కోహ్లీపై, రవిశాస్త్రిపై మండిపడుతున్నారు. రవిశాస్త్రి, కోహ్లీ కలిసి భారత క్రికెట్ ను సర్వనాశనం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

ఆంటిగ్వా: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. వెస్టిండీస్ పై జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో ఇండియా వైఫల్యంపై వారు కోహ్లీని, టీమిండియా కోచ్ రవిశాస్త్రిని విమర్శలతో ముంచెత్తుతున్నారు. 

కోహ్లీని ఇడియట్ గా, స్టుపిడ్ గా భారత క్రికెట్ అభిమానులు అభివర్ణిస్తున్నారు. రోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై వారు కోహ్లీపై, రవిశాస్త్రిపై మండిపడుతున్నారు. రవిశాస్త్రి, కోహ్లీ కలిసి భారత క్రికెట్ ను సర్వనాశనం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రపంచ కప్ టోర్నమెంటులో సెంచరీలు చేసిన రోహిత్ శర్మను మాత్రమే కాకుండా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కూడా తొలి టెస్టు తుది జట్టులోకి తీసుకోకపోవడాన్ని తప్పు పడుతున్నారు. కావాలనే వారిద్దరని పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు. 

రోహిత్ శర్మను పక్కన పెట్టడం వెనక కోహ్లీ హస్తం ఉందని, ఇరువురి మధ్య తగాదా కారణంగానే రోహిత్ ను పక్కన పెట్టారని అంటున్నారు. తమ మధ్య విభేదాలు లేవని కోహ్లీ చెబుతున్నప్పటికీ తాజా సంఘటనతో గొడవలు వాస్తవమేనని అనుకోవాల్సి వస్తోందని అభిమానులు అంటున్నారు. 

ఒక్క ఐపిఎల్ టోర్నీ కూడా గెలువని కోహ్లీ రోహిత్ ను పక్కన పెడుతాడా అని మండిపడుతున్నారు. కోహ్లీకి ఇష్టం కావడంతో విఫలమవుతున్నప్పటికీ కెఎల్ రాహుల్ ను తుది జట్టులోకి తీసుకుంటున్నారని అంటున్నారు. సొంత ప్రయోజనాల కోసం కోహ్లీ జట్టును భ్రష్టుపట్టిస్తున్నాడని అంటున్నారు. రవిశాస్త్రి, కోహ్లీ కాంబినేషన్ చాలా ప్రమాదకరమైందని, ఇరువురు కలిసి టీమిండియాను నాశనం చేస్తున్నారని క్రికెట్ అభిమానులు అంటున్నారు. 

click me!