ప్రపంచస్థాయి బౌలర్లలో ఆర్చరే నెంబర్ వన్: వార్నర్

By Arun Kumar PFirst Published Aug 23, 2019, 2:14 PM IST
Highlights

ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న  యాషెస్ సీరిస్ లో జోఫ్రా ఆర్చర్ మరోసారి చెలరేగాడు.తమ జట్టుపై ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగిన అతడిపై డేవిడ్ వార్నర్ ప్రశంసల జల్లు కురిపించాడు.  

జోఫ్రా ఆర్చర్... ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లె మారుమోగుతున్న పేరు. యాషెస్ సీరిస్ ద్వారా టెస్టుల్లో ఆరంగేట్రం చేసిన అతడు నిప్పులుచెరిగే బంతులతో సీనియర్ ఆటగాళ్లను సైతం బెంబేలెత్తిస్తున్నాడు.ఆసిస్ పై ఆరంగేట్ర టెస్టులో అదరగొట్టిన ఆర్చర్ హెడింగ్లీ టెస్టులో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. మూడో టెస్ట్ లో ఆర్చర్  ఏకంగా ఆరు వికెట్లను పడగొట్టి కంగారు జట్టు పతనాన్ని శాసించాడు. 

ఇలా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఆర్చర్ ను ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ప్రశంసించకుండా వుండలేకపోతున్నారు.  అతడి బౌలింగ్ లో ఔటై పెవిలియన్ కు చేరిన ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అయితే ఆకాశానికెత్తేశాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఆర్చరే నెంబర్ బౌలర్ అంటూ కొనియాడాడు.  

''ఆరంభ ఓవర్లలో ఆర్చర్ కొత్త బంతితో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. పరిస్థితులకు అనుకూలంగా అతడి బౌలింగ్ వుంటోంది. అతడి వేగం, పేస్ ను చూస్తుంటే డేల్ స్టెయిన్ బౌలింగ్ గుర్తొస్తోంది. అతడిలాగే ఆర్చర్ లో కూడా అద్భుతమైన ప్రతిభ దాగివుంది. ప్రస్తుతమున్న అంతర్జాతీయ స్థాయి బౌలర్లలో ఆర్చరే నెంబర్ వన్.'' అని వార్నర్ పేర్కొన్నాడు. 

యాషెస్ సీరిస్ లో భాగంగా జరుగుతున్న మూడో టెస్ట్ లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 61 పరుగులు, లబుషేన్  74 పరుగులు మాత్రమే రాణించారు. వీరిద్దరే 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ జోడీని విడగొట్టిన ఆర్చర్ ఆసిస్ బ్యాటింగ్ లైనప్ ను పేకమేడలా కుప్పకూల్చాడు. తక్కువ పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోవడంతో 179 పరుగుల వద్దే ఇన్నింగ్స్ ముగిసింది. ఆర్చర్ కేవలం 45 పరుగులు మాత్రమే  సమర్పించుకుని ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. 

 

click me!