భారత్VS వెస్టిండీస్.. స్పిన్నర్ల చెత్త రికార్డ్

By telugu teamFirst Published Dec 17, 2019, 7:46 AM IST
Highlights

స్పెషలిస్ట్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌తోపాటు పార్ట్‌టైం బౌలర్ కేదార్ జాదవ్‌‌లతో భారత్ బరిలోకి దిగగా.. లెగ్ స్పిన్నర్ హెడెన్ వాల్ష్, ఆఫ్ స్పిన్నర్ రోస్టన్ చేజ్‌లతో విండీస్ బరిలోకి దిగింది. ఇరు జట్లలోని స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో 33 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో విండీస్, భారత్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. కాగా...  ఈ మ్యాచ్ లో విండీస్ విజయం సాధించగా... టీమిండియా ఓటమి పాలయ్యింది. అయితే... గెలుపు.. ఓటములు పక్కన పెడితే.. ఇరు జట్ల స్పిన్నర్లు ఆటలో ఘోరంగా విఫలమయ్యారు. ఇరు జట్ల స్పిన్నర్లు చెత్త రికార్డును మూటగట్టుకున్నారు.

స్టేడియం స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ... వారు విఫలం కావడం గమనార్హం. వికెట్లు తీయడానికి చాలా కష్టపడ్డారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌తోపాటు పార్ట్‌టైం బౌలర్ కేదార్ జాదవ్‌‌లతో భారత్ బరిలోకి దిగగా.. లెగ్ స్పిన్నర్ హెడెన్ వాల్ష్, ఆఫ్ స్పిన్నర్ రోస్టన్ చేజ్‌లతో విండీస్ బరిలోకి దిగింది. ఇరు జట్లలోని స్పిన్నర్లు ఈ మ్యాచ్‌లో 33 ఓవర్లు బౌలింగ్ చేసినా ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
 
ఈ ఐదుగురు స్పిన్నర్లు కలిసి మొత్తంగా 198 బంతులు సంధించినా ఒక్క వికెట్‌ను కూడా నేలకూల్చలేకపోయారు. ఇండియాలో జరిగిన ఓ వన్డేలో స్పిన్నర్లు ఇన్ని బంతులు వేసినా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా నాలుగోసారి. 2001/2002లో బంగ్లాదేశ్-జింబాబ్వే మధ్య ఢాకాలో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్లు 228 బంతులు సంధించినా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. 

ఈ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలించేదే కావడం గమనించాల్సిన విషయం. 2011లో జింబాబ్వే-పాకిస్థాన్ మధ్య హరారేలో జరిగిన మ్యాచ్‌లో 222 బంతులు సంధించిన స్పిన్నర్లు వికెట్ పడగొట్టలేకపోయారు. 1996/97లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బౌలర్లు 216 బంతులు బేసినా వికెట్ తీయలేకపోయారు.

click me!