T20 World Cup 2024 : కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ బ్యాటింగ్ కు తోడుగా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రాల అద్భుతమైన బౌలింగ్ తో రెండో సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించింది టీమిండియా. దీంతో టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ జరిగే కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ రిపోర్టు, గత రికార్డులు, వాతావరణ వివరాలు గమనిస్తే టాస్ కీలకం కానుంది.
T20 World Cup 2024 : టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డిండ్ లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ ను చిత్తుగా ఓడించి టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ కు చేరింది టీమిండియా. ఈ విజయంతో 2023 ఓటమికి ఇంగ్లండ్ పై ప్రతీకారం తీర్చుకుంది రోహిత్ సేన. ఐసీసీ కప్ గెలవడమే లక్ష్యంగా మెగా టోర్నీకి వచ్చిన భారత జట్టు వరుస విజయాలతో ఒక్క అడుగుదూరంలో ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ల లో క్రిస్ జోర్డాన్ 3 వికెట్లు తీసుకున్నాడు. 172 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల దెబ్బకు 103 పరుగులకే ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ 3, కుల్ దీప్ యాదవ్ 3, బుమ్రా 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో భారత జట్టు 69 పరుగుల తేడాతో విజయం అందుకుని ఫైనల్ కు చేరుకుంది.
సౌతాఫ్రికాతో టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ ఫోరు..
undefined
బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ భారత జట్టు సూపర్ ప్రదర్శనతో సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించి టీ20 ప్రపంచ కప్ 2024 లో ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ పోరు కోసం సెమీ ఫైనల్ 1 లో ఆఫ్ఘనిస్తాన్ జట్టును ఓడించి ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా ఫైనల్ కు చేరుకుంది. ఈ ప్రపంచ కప్ లో ఇరు జట్టు ఒక్క మ్యాచ్ ను కూడా ఓడిపోకుండా ఫైనల్ కు చేరుకున్నాయి. అయితే, సౌతాఫ్రికా తన అన్ని మ్యాచ్ లను ఆడి వరుస విజయాలతో ఫైనల్ చేరుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా తన అన్ని మ్యాచ్ లలో విజయాన్ని అందుకుంది కానీ, లీగ్ దశలో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆడలేకపోయింది. ఇరు జట్లు మంచి ఫామ్ లో ఉన్నాయి కాబట్టి ఫైనల్ పోరు మరింత రసవత్తరంగా ఉండటం పక్కా..
కెన్సింగ్టన్ ఓవల్ లో ఫైనల్ మ్యాచ్.. వాతావరణం, పిచ్ రిపోర్టులు ఏం చెబుతున్నాయంటే?
టీ20 ప్రపంచ కప్ 2024 తుది సమరం బార్బడోస్‌లోని ఐకానిక్ కెన్సింగ్టన్ ఓవల్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ లో బలమైన టీమిండియా-సౌతాఫ్రికాలు తలపడనున్నాయి. గెలిచిన జట్టు ఛాంపియన్ గా నిలవనుంది. శనివారం జరగబోయే ఈ మ్యాచ్ ను వర్షం దెబ్బకొట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న వాతావరణ నివేదికల ప్రకారం.. ఫైనల్ మ్యాచ్ రోజున 70 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం. భారత కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఒకవేళ వర్షంతో పడితే ఓవర్లు తగ్గించి మ్యాచ్ జరపనున్నాయి. మ్యాచ్ ఆడటం కుదరకపోతే రిజర్వు డే, అదీ కుదరకపోతే ఇరు జట్లను విజేతలుగా ప్రకటిస్తారు.
కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ పై పరుగులు చేయడం కష్టమే..
కెన్సింగ్టన్ ఓవల్ పిచ్ నెమ్మదిగా ఉండనుంది. దీంతో ఇక్కడి పిచ్ పై బ్యాటింగ్ చేయడంతో ఆటగాళ్లకు కష్టమే. పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని గత రికార్డులు పేర్కొంటున్నాయి. అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ కు పరుగులు వస్తున్నాయి కానీ, సెకండ్ బ్యాటింగ్ జట్టు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఇక్కడ టీ20 ప్రపంచ కప్ 2024 లో సూపర్ 8 రౌండ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో తలపడింది. ఈ మ్యాచ్ లో భారత్ 47 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 181/8 పరుగులు చేయగా, ఆఫ్ఘన్ జట్టు కేవలం 134 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక్కడ జరిగిన మొత్తం టీ20 మ్యాచ్ లను గమనిస్తే సగటు స్కోరు 160 పరుగుల కంటే తక్కువగానే ఉంది. కాబట్టి టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడం కలిసివచ్చే అంశం.
T20 WORLD CUP 2024 : భారత్ దెబ్బకు బిత్తరపోయిన ఇంగ్లండ్..