IND vs SA: దక్షిణాఫ్రికాపై భార‌త్ సంచ‌ల‌న విజ‌యం.. టెస్టు సిరీస్ డ్రా

By Mahesh Rajamoni  |  First Published Jan 4, 2024, 5:12 PM IST

IND vs SA: కేప్ టౌన్ లో జ‌రుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా జట్ల రెండో టెస్టు మ్యాచ్ లో భార‌త్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ విజ‌యంతో రెండు మ్యాచ్ ల సిరీస్ ను భార‌త్ డ్రా చేసుకుంది. 
 


IND vs SA: కేప్ టౌన్ లో జ‌రుగుతున్న భారత్-దక్షిణాఫ్రికా జట్ల రెండో టెస్టు మ్యాచ్ లో భార‌త ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త బౌల‌ర్లు అద‌ర‌గొట్టడంతో సౌతాఫ్రికా మొద‌టి ఇన్నింగ్స్ లో 55 ప‌రుగులు, రెండో ఇన్నింగ్స్ లో 176 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 153 ప‌రుగుల‌కు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్ లో  80/3 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది.  ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు పడగొట్టి రికార్డుల మోత మోగించాడు. మొద‌టి ఇన్నింగ్స్ లో సిరాజ్ ఆరు వికెట్ల‌తో ఆద‌ర‌గొట్టాడు.

 

India emerge victorious within five sessions of play in the Cape Town Test to level the series 👊 | 📝: https://t.co/eiCgIxfJNY pic.twitter.com/XpqaIEBeGk

— ICC (@ICC)

Latest Videos

undefined

దక్షిణాఫ్రికా నిర్దేశించిన 79 పరుగుల లక్ష్యాన్ని యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వికెట్లు కోల్పోయి భారత్ 12 ఓవర్లలోనే చేధించింది. యశశ్వి 23 బంతుల్లో 28 పరుగులు చేసి ఔట్ కాగా, గిల్ 11 బంతుల్లో 10 పరుగులు, కోహ్లి 11 బంతుల్లో 12 పరుగులతో వెనుదిరగగా, కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ భారత్ విజయాన్ని పూర్తి చేశారు. రోహిత్ 17 పరుగులతో, శ్రేయాస్ నాలుగు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 

ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. కొత్త సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించిన భారత్ కేప్ టౌన్‌లో తొలి విజయాన్ని అందుకుంది. స్వల్ప లక్ష్యం దిశగా బ్యాట్‌ విసిరిన భారత్‌కు యశస్వి జైస్వాల్‌ ఛేదించడం ప్రారంభించడంతో భార‌త్ విజ‌య ల‌క్ష్యం సులువుగా మారింది. రోహిత్‌కు రెండుసార్లు లైఫ్ లభించడం భారత్‌కు వరంలా మారింది. విజయానికి నాలుగు పరుగుల దూరంలో కోహ్లీ ఔటయ్యాడు. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 55, 176, భారత్ 153, 80-3 ప‌రుగులు చేశాయి. కేప్ టౌన్ టెస్టు కూడా టెస్టు చరిత్రలోనే అతి తక్కువ ఓవర్లలో పూర్తి చేసిన టెస్టుగా రికార్డు సృష్టించింది. రెండు రోజుల్లో ఐదు సెషన్లలో 107 ఓవర్లలో మ్యాచ్ పూర్తయింది.

పిల్లలు లేవగానే ఉదయాన్నే పేరెంట్స్ చేయాల్సినది ఇదే..!

click me!