సాహాను కాదని టీం ఇండియాలోకి రిషబ్ పంత్... కారణాలు ఇవే!

By telugu teamFirst Published Feb 21, 2020, 2:11 PM IST
Highlights

టెస్టుల్లో పంత్ కన్నా ప్రాధాన్యత సాహాకే అనే విషయాన్నీ ఇప్పటికే చాలాసార్లు టీం మానేజ్మెంట్ చాలాసార్లు చెప్పకనే చెప్పింది.  విచిత్రంగా మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రాధాన్యత కల్పించింది. లంచ్‌కు ముందు, టీ తర్వాత సెషన్లలో రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపింగ్‌ చేయగా.. లంచ్‌ తర్వాత ఒక్క సెషన్‌లో మాత్రమే వృద్దిమాన్‌ సాహా వికెట్ల వెనకాల కనిపించాడు.

అందరూ తన పనయిపోయిందనుకుంటున్న తరుణంలో రిషబ్ పంత్ టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. వృద్ధిమాన్ సాహాను కాదని రిషబ్ పంత్ కి ఫైనల్ జట్టులో స్థానం కల్పించింది టీం ఇండియా. ఈ నేపథ్యంలో అసలు టీం ఇండియా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటో ఒకసారి చూద్దాం. 

టెస్టుల్లో పంత్ కన్నా ప్రాధాన్యత సాహాకే అనే విషయాన్నీ ఇప్పటికే చాలాసార్లు టీం మానేజ్మెంట్ చాలాసార్లు చెప్పకనే చెప్పింది.  విచిత్రంగా మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌కు జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రాధాన్యత కల్పించింది.

లంచ్‌కు ముందు, టీ తర్వాత సెషన్లలో రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపింగ్‌ చేయగా.. లంచ్‌ తర్వాత ఒక్క సెషన్‌లో మాత్రమే వృద్దిమాన్‌ సాహా వికెట్ల వెనకాల కనిపించాడు.  

బ్యాటింగ్‌లోనూ వృద్దిమాన్‌ సాహా కంటే ముందుగా పంత్‌ను పంపించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇద్దరు నిరాశపరిచారు. రెండో ఇన్నింగ్స్‌ల్లో 65 బంతుల్లో 70 పరుగులు చేసిన పంత్‌ తన చేయగలిగే ప్రదర్శన ఏంటో చూపించాడు. 

న్యూజిలాండ్ పిచ్ పరిస్థితులు.... కలిసివచ్చిన అవకాశం!

భారత పిచ్‌లపై పేస్‌తో పాటు సుదీర్ఘ సెషన్ల పాటు స్పిన్‌ను కూడా వికెట్ల వెనకాల కాచుకోవాలి. విదేశీ పిచ్‌లు అందుకు భిన్నం. స్వదేశంలో వికెట్‌ కీపర్‌ బ్యాటింగ్‌ సామర్థ్యంపై ఆధారపడాల్సిన అవసరం కోహ్లిసేనకు ఏ కోశాన ఉండదు. 

Also read; రిషబ్ పంత్ కు అజింక్యా రహానే సలహా ఇదే....

కానీ విదేశీ పిచ్‌లపై మూడో ఇన్నింగ్స్‌లో వేగంగా పరుగులు చేయగల ఓ బ్యాట్స్‌మన్‌ భారత్‌కు అవసరం. వికెట్‌ కీపింగ్‌ నైపుణ్యం ప్రకారం సాహా ముందు వరుసలో ఉంటాడు. కానీ న్యూజిలాండ్‌ పిచ్‌లపై, వార్మప్‌లో పంత్‌ గ్లౌవ్స్‌తో మెరుగ్గానే రాణించాడు. 

న్యూజిలాండ్‌ పిచ్‌లపై బంతి స్వింగ్‌ అవుతుంది. బౌన్స్‌లో నిలకడ ఉంటుంది( భారత్‌లో బౌన్స్‌ అంత నిలకడగా ఉండదు) ఇక్కడ వికెట్‌ కీపర్లు ఎక్కువగా వికెట్లకు దూరంగానే నిల్చోని ఉండాలిసుంటుంది. 

తొలి రెండు రోజులు పేసర్లకు అనుకూలించిన తర్వాత న్యూజిలాండ్‌ పిచ్‌లు క్రమంగా స్పిన్‌కు మొగ్గుచూపుతున్నాయి. నాల్గో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేసేందుకు బౌలర్లకు తగినంత సమయం, ఓవర్లు ఇవ్వాలి. 

అందుకు మూడో ఇన్నింగ్స్‌లో భారత్‌ తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు రాబట్టాలి. అందుకే కోహ్లి, శాస్త్రి విదేశీ పిచ్‌లపై రిషబ్‌ పంత్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పంత్ తన సహజ ఆటతీరుకు పూర్తి భిన్నంగా ఆచి తూచి ఆడుతూ వికెట్లను కాపాడుకుంటున్నారు. 

న్యూజిలాండ్‌ జట్టులో అజాజ్‌ పటేల్‌ రూపంలో ఒక్క స్పిన్నర్ మాత్రమే ఉన్నాడు. బ్యాటింగ్‌ లైనప్‌లో ఓ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మన్‌ ఉండాల్సిన అవసరం, స్పిన్నర్‌కు చెక్‌ పెట్టాలనే ఆలోచన సైతం పంత్‌ కు వెల్లింగ్టన్‌ టెస్టు అవకాశాన్ని అందించింది. 

click me!