భారత్ vs న్యూజిలాండ్ : రాస్ టేలర్ వరల్డ్ రికార్డ్... ఆ ఘనత సాధించిన తొలి క్రికెటర్

By telugu news teamFirst Published Feb 21, 2020, 11:42 AM IST
Highlights

వెల్లింగ్ట‌న్‌లో శుక్ర‌వారం ప్రారంభ‌మైన ఈ మ్యాచ్‌లో త‌న ఫ్యామిలీతో క‌లిసి టేల‌ర్ మైదానంలోకి వ‌చ్చాడు. గత నెలలో భార‌త్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో వంద టీ20లు పూర్తి చేసుకున్న టేల‌ర్‌.. తాజా టెస్టు సిరీస్‌లో వంద టెస్టుల మార్కును చేరుకున్నాడు.

న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు టీమిండియాతో తలపడుతున్న సంగతి తెలిసిందే.  ఈ రెండు జట్ల మధ్య నేడు జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లోనే రాస్ టేలర్ ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.

వ‌న్డేలు, టీ20లు, టెస్టులు ఇలా మూడు ఫార్మాట్ల‌లోనూ వంద అంతర్జాతీయ మ్యాచ్‌ల‌ను పూర్తి చేసుకున్న తొలి క్రికెట‌ర్‌గా రాస్ టేలర్ నిలిచాడు. ఈ ఘనత అందుకున్న తొలి క్రికెటర్ రాస్ టేలర్ కావడం గమనార్హం. వెల్లింగ్ట‌న్‌లో శుక్ర‌వారం ప్రారంభ‌మైన ఈ మ్యాచ్‌లో త‌న ఫ్యామిలీతో క‌లిసి టేల‌ర్ మైదానంలోకి వ‌చ్చాడు. గత నెలలో భార‌త్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో వంద టీ20లు పూర్తి చేసుకున్న టేల‌ర్‌.. తాజా టెస్టు సిరీస్‌లో వంద టెస్టుల మార్కును చేరుకున్నాడు.

Also Read న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా: 30 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టిన మయాంక్...

2006లో అరంగేట్రం చేసిన 35 ఏళ్ల టేల‌ర్‌.. ఇప్ప‌టివ‌ర‌కు 100 టెస్టులు, 231 వ‌న్డేలు, 100 టీ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టులు, వ‌న్డేల్లో కివీస్ త‌ర‌పున లీడింగ్ ర‌న్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అలాగే 40 సెంచ‌రీల‌తో ఆ జ‌ట్టు త‌ర‌పున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన క్రికెట‌ర్‌గా ఘ‌న‌త వ‌హించాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు టేలర్ 7174 పరుగులు చేయగా.. వన్డే అంతర్జాతీయ మ్యాచుల్లో 8570 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా.. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు తాను ఆడ‌తాన‌ని టేలర్ ఇటీవలే ప్రకటించాడు.

ఇదిలా ఉండగా.. ఉదయం ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే కష్టాల్లో పడిపోయింది. వరసగా బ్యాట్స్ మెన్స్ పెవీలియన్ బాట పట్టారు. 
 

click me!