Rohit Sharma: సచిన్, ద్రావిడ్ సరసన రోహిత్

Published : Mar 09, 2025, 10:58 PM IST
Rohit Sharma: సచిన్, ద్రావిడ్ సరసన రోహిత్

సారాంశం

India vs New Zealand: న్యూజిలాండ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ శర్మ రికార్డు కొట్టాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ లాంటి లెజెండరీల సరసన చేరాడు. రోహిత్ కొట్టిన రికార్డేంటి? మధ్యలో టెన్షన్ ఎందుకు?

India vs New Zealand: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ప్రతి క్షణం ఉత్కంఠ రేగింది. కానీ చివరకు రోహిత్ సేన విజయాన్ని అందుకుంది. ఛాంపియన్ గా నిలిచింది. న్యూజిలాండ్ ఇచ్చిన 252 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేస్తూ టీమిండియా మంచి ఆరంభం పొందింది. కానీ తర్వాత వికెట్లు కోల్పోయింది. కానీ చివరకు మరో ఓవర్ మిగిలి వుండగానే విజయాన్ని అందుకుంది. దీంతో 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు కొట్టాడు. అంతేకాదు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, మహ్మద్ అజారుద్దీన్ లాంటి గొప్ప ఆటగాళ్ల సరసన చేరాడు.

రోహిత్ శర్మ రికార్డు


న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 76 పరుగులు చేసి మెరిశాడు. దీంతో రోహిత్ శర్మ న్యూజిలాండ్‌పై వన్డేల్లో 1,000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కివీస్‌పై 1000 పరుగులు చేసిన 7వ భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ లిస్టులో సచిన్ టెండూల్కర్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే, విరాట్ కోహ్లీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.

 

న్యూజిలాండ్‌పై 1,000 పరుగుల రికార్డు(వన్డేల్లో)


సచిన్ టెండూల్కర్: 1750 పరుగులు
విరాట్ కోహ్లీ : 1656 పరుగులు
వీరేంద్ర సెహ్వాగ్: 1157 పరుగులు
మహ్మద్ అజారుద్దీన్: 1118 పరుగులు
సౌరవ్ గంగూలీ: 1079 పరుగులు
రాహుల్ ద్రావిడ్: 1032 పరుగులు
రోహిత్ శర్మ: 1,000 పరుగులు

ఇది మాత్రమే కాదు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో 50 ప్లస్ రన్స్ చేసిన నాలుగో కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. ఈ లిస్టులో సౌరవ్ గంగూలీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు.

 

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో 50 ప్లస్ రన్స్ చేసిన కెప్టెన్లు


సౌరవ్ గంగూలీ: 117 పరుగులు
రోహిత్ శర్మ: 76 పరుగులు
సనత్ జయసూర్య: 74 పరుగులు
హాన్సి క్రోనియే: 61* పరుగులు
 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !
Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?