India vs England 4th Test Day 1 Live : మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ vs ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. భారత్-ఇంగ్లాండ్ నాల్గో టెస్టు మొదటి రోజు లైవ్ స్కోర్, ఇతర అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి.

11:12 PM (IST) Jul 23
మాంచెస్టర్‌లో మొదటి రోజు ఆటను భారత్ 264/4 పరుగులతో ముగించింది. వెలుతురు తగ్గిపోవడంతో ఆటను నిలిపివేశారు.
భారత్ : 264/4
రవీంద్ర జడేజా (19 నాటౌట్)
శార్దూల్ ఠాకూర్ (19 నాటౌట్)
10:27 PM (IST) Jul 23
హాఫ్ సెంచరీ కొట్టి మంచి జోష్ లో అడుతున్న సాయి సుదర్శన్ ను బెన్ స్టోక్స్ పెవిలియన్ కు పంపాడు. మిడిల్, లెగ్ వైపు షార్ట్ బంతిని పుల్ చేయబోయి టాప్ ఎడ్జ్ తో కార్స్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు.
భారత్ స్కోరు: 235/4
సాయి సుదర్శన్: 61 (51 బంతుల్లో), అతనికి ఇది తొలి టెస్ట్ హాఫ్ సెంచరీ
10:11 PM (IST) Jul 23
రిషబ్ పంత్ కాలుకు గాయం అయింది. కాలు వాపుకు గురికావడంతో అతను నవడవలేని స్థితికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే పంత్ గ్రౌండ్ ను వీడాడు. దీంతో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చారు.
10:02 PM (IST) Jul 23
- రిషబ్ పంత్ ఇప్పుడు ఇంగ్లాండ్‌పై 1000 టెస్ట్ పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు.
- ఇదే ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ కూడా ఇదే మైలురాయిని సాధించారు.
- వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా పంత్ విదేశీ టెస్ట్ మ్యాచుల్లో 1000+ పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్.
ఇంగ్లాండ్ లో 1000+ టెస్ట్ పరుగులు చేసిన భారత ప్లేయర్లు
- సునీల్ గవాస్కర్
- సచిన్ టెండూల్కర్
- రాహుల్ ద్రవిడ్
- కేఎల్ రాహుల్
- రిషబ్ పంత్
08:14 PM (IST) Jul 23
భారత జట్టు మూడో వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయారు. 12 పరుగుల వద్ద ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం భారత 148/3 (51.2) పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.
భారత్ : 149/3 (51.3)
రిషబ్ పంత్ 2* పరుగులు
సాయి సుదర్శన్ 26* పరుగులు
07:52 PM (IST) Jul 23
మాంచెస్టర్ టెస్టులో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 58 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. లియామ్ డాసన్ బౌలింగ్ లో హ్యారీ బ్రూక్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. అప్పటికీ భారత్ 120-2 పరుగులు చేసింది.
07:11 PM (IST) Jul 23
మాంచెస్టర్ టెస్టులో యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అలాగే, భారత జట్టు 100 పరుగుల మార్కును దాటింది. జైస్వాల్ కు ఇది 12 టెస్టు హాఫ్ సెంచరీ.
భారత్ : 115/1 (38)
జైస్వాల్ 55, సాయి సుదర్శన్ 12 పరుగులతో ఆడుతున్నారు.
06:37 PM (IST) Jul 23
మాంచెస్టర్ టెస్టులో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 46 పరుగుల వద్ద ఔట్ అయ్యారు. బ్రైడన్ కార్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యారు.
భారత్ స్కోర్ 96/1
06:33 PM (IST) Jul 23
భారత జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ మరో రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. ఇంగ్లాండ్ లో ఈ మైలురాయిని చేరుకున్న 5వ భారత ప్లేయర్ గా నిలిచాడు. రాహుల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీలు మాత్రమే ఈ ఘనత సాధించారు.
06:30 PM (IST) Jul 23
లంచ్ సమయానికి భారత్ 78/0* పరుగులు చేసింది. మొదటి సెషన్ లో జైస్వాల్, రాహుల్ జోడీ నెమ్మదిగా ఆడుతూ స్థిరంగా స్కోర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. లంచ్ సమయానికి భారత్ వికెట్ కోల్పోకుండా 78 పరుగులు చేసింది.
05:10 PM (IST) Jul 23
నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్.. దూకుడు పెంచుతోంది. తొలి సెషన్ లో భారత్ 20 ఓవర్లలో58/0 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, జైస్వాల్ లు 50 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేశారు.
IND 58/0 (20)
కేఎల్ రాహుల్ 37 పరుగులు
యశస్వి జైస్వాల్ 19 పరుగులు
04:28 PM (IST) Jul 23
IND vs ENG 4th Test LIVE: 11 ఓవర్లకు భారత్ 31/0*
జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్ ఇద్దరూ బాగా బౌలింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లు నిలకడగా ఆడుతున్నారు. 11 ఓవర్ల ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది.
జైస్వాల్ 12 పరుగులు, కేఎల్ రాహుల్ 19 పరుగులతో ఆడుతున్నారు.
04:20 PM (IST) Jul 23
Who Is Anshul Kamboj: చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ అన్షుల్ కాంబోజ్ ఇంగ్లాండ్‌పై మాంచెస్టర్ టెస్టులో భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. అసలు ఎవరీ అన్షుల్ కాంబోజ్? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
03:35 PM (IST) Jul 23
IND vs ENG 4th Test Live: మాంచెస్టర్ లో జరుగుతున్న నాల్గో టెస్టుతో భారత జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు. అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేశాడు. అలాగే, ఇంగ్లాండ్ జట్టులోకి చాలా కాలం తర్వాత లియామ్ డాసన్ రీఎంట్రీ ఇచ్చాడు.
నాల్గో టెస్టుకు ఇరు జట్ల ప్లేయింగ్ 11
భారత్: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ , సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్, రవీంద్ర జడేజా , వాషింగ్టన్ సుందర్ , శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా , మహ్మద్ సిరాజ్ , అన్షుల్ కాంబోజ్
ఇంగ్లాండ్ : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (w), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్
03:29 PM (IST) Jul 23
IND vs ENG 4th Test LIVE: మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు బెన్ స్టోక్స్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ తో తలపడుతోంది. భారత్ టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచి ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.