టీమిండియా విజయం బాధేసిందన్న రికీపాంటింగ్

By telugu news teamFirst Published Jan 20, 2021, 1:58 PM IST
Highlights

టీమిండియా బాగా పోరాడిందని.. విజయానికి వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. గాయాలతో ప్రధాన ఆటగాళ్లంతా దూరమైనా.. యువ భారత్ కంగారూలను మట్టికరిపించిన సంగతి తెలిసిందే.
 

బ్రిస్బేన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.  అయితే.. కీలక ఆటగాళ్లు లేకపోయినప్పటికీ తమ జట్టు ఓడిపోవడం చాలా బాధేసిందని ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నారు. స్టార్ బ్యాట్స్ మెన్ వార్నర్, స్టీవ్ స్మిత్ తో పటిష్టంగా ఉన్న తమ జట్టు.. స్వదేశంలో ఓడిపోవడం చాలా కష్టంగా ఉందని పేర్కొన్నాడు. 

టీమిండియా బాగా పోరాడిందని.. విజయానికి వారు అర్హులని ఆయన పేర్కొన్నారు. గాయాలతో ప్రధాన ఆటగాళ్లంతా దూరమైనా.. యువ భారత్ కంగారూలను మట్టికరిపించిన సంగతి తెలిసిందే.

‘‘ ఈ సిరీస్ ను ఆసీస్ ఓడిపోవడవం చాలా బాధేసింది. ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. గత ఐదు వారాల్లో టీమిండియా పరిస్థితి చూస్తే కెప్టెన్ ఖోహ్లీ లేడు. గాయాలతో ఆటగాళ్లు దూరమయ్యారు. సిరీస్ లో దాదాపు 20 మంది ఆడారు. ఇంకో వైపు ఆసీస్ జట్టు  చాలా స్ట్రాంగ్ ఉంది. అయినా  కూడా మేం ఓడిపోవడం ఎంతో కష్టంగా ఉంది. ప్రతి టెస్టు మ్యాచ్ లోనూ టీమిండియా పై చేయి సాధించింది. కానీ ఆస్ట్రేలియా సాధించలేకపోయింది. రెండు జట్ల మధ్య ఉన్న తేడా అదే. ఇండియా గొప్పగా ఆడింది.’ అని పాంటింగ్ అన్నారు.  వాషింగ్టన్ సుందర్ అత్యంత అద్భుతంగా ఆడాడని ప్రశంసలు కురిపించాడు. 

click me!