ఆ వీడియోలు చూసి నేర్చుకున్నా, ఎంజాయ్ చేస్తూ ఆడతా.. కేఎల్ రాహుల్

By telugu teamFirst Published Jan 18, 2020, 3:16 PM IST
Highlights

ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అది తనకు గొప్ప ఛాలెంజ్ గా భావిస్తానని అన్నాడు. ఒక టీమ్ కోసం ఆడేటప్పుడు.. అందరూ ఒక జట్టుగా ఆడాలన్నాడు. అలాంటప్పుడు తనకు ఈ స్థానమే కావాలని కోరుకోకూడదన్నాడు. ఎక్కడైనా బ్యాటింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్... ప్రస్తుతం మాంచి ఫామ్ లో ఉన్నాడు. శుక్రవారం వాంకడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో ఇరగదీశాడు. అటు బ్యాటింగ్ తోపాటు... ఇటు వికెట్ కీపంలోనూ అదరగొట్టాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతని కైవసమైంది. ఇప్పుడైతే ఇలా ఆడాడు కానీ... తొలుత మాత్రం వివాదాలన్నీ రాహుల్ చుట్టూ ఉండేవి. తొలుత బ్యాటింగ్ తోనూ ఆకట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఏ పొజిషన్ లో బ్యాటింగ్ దిగడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.

నిన్నటి మ్యాచ్ విజయం అనంతరం కేఎల్ రాహుల్ మీడియాతో మాట్లాడాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అది తనకు గొప్ప ఛాలెంజ్ గా భావిస్తానని అన్నాడు. ఒక టీమ్ కోసం ఆడేటప్పుడు.. అందరూ ఒక జట్టుగా ఆడాలన్నాడు. అలాంటప్పుడు తనకు ఈ స్థానమే కావాలని కోరుకోకూడదన్నాడు. ఎక్కడైనా బ్యాటింగ్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు.

Also Read ‘కోహ్లీ ఆ భంగిమ ట్రై చేయలేదని అనుష్కకి కోపం’... రచయిత్రి అసభ్యకర కామెంట్

తాను పెద్దగా ఒత్తిడి తీసుకోనని.. స్వేచ్ఛగా ఆడటానికే ప్రధాన్యత ఇస్తానని వివరించాడు. ఎక్కువ శాతం తాను ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడతానని చెప్పాడు. అనంతరం తన మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ప్రిపరేషన్ గురించి తెలిపాడు. పలువురు మిడిల్ ఆర్డర్ ఆటగాళ్ల వీడియోలు చూసేవాడినని.. అవి తనకు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పాడు.

విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, స్టీవ్ స్మిత్, కేన్ విలయమ్స్ వీడియోలను ఎక్కువగా చూస్తూ ఉంటానని చెప్పాడు. మిడిల్ ఆర్డర్ లో తన బ్యాటింగ్ మెరుగు కావడానికి ఆ వీడియోలే కారణమని తెలిపాడు. 

click me!