టీమిండియాతో వన్డే సిరీస్‌కి జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా... ఆ ఇద్దరి రీఎంట్రీ కన్ఫార్మ్...

Published : Feb 23, 2023, 04:59 PM ISTUpdated : Feb 23, 2023, 05:15 PM IST
టీమిండియాతో వన్డే సిరీస్‌కి జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా... ఆ ఇద్దరి రీఎంట్రీ కన్ఫార్మ్...

సారాంశం

India vs Australia: గాయంతో టెస్టు సిరీస్‌కి దూరమైన డేవిడ్ వార్నర్‌‌తో పాటు మ్యాక్స్‌వెల్‌కి వన్డే సిరీస్‌లో చోటు... 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో ఫెవరెట్‌గా బరిలో దిగింది ఆస్ట్రేలియా. నెం.1 టెస్టు టీమ్‌గా ఉన్న ఆసీస్, మొదటి రెండు టెస్టుల్లో ఆ రేంజ్ పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేకపోయింది. నాగ్‌పూర్ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన ఆస్ట్రేలియా.. ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది...

ఇరు జట్ల మధ్య ఇండోర్‌ వేదికగా మార్చి 1 నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియాతో కలిసి 3 మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది ఆస్ట్రేలియా..

ఈ సిరీస్‌కి జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. రెండో టెస్టు ముగిసిన తర్వాత వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిన ప్యాట్ కమ్మిన్స్, వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కి దూరమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో పాటు ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్... వన్డే సిరీస్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు...

గాయంతో టెస్టు సిరీస్‌కి దూరమైన ఫాస్ట్ బౌలర్ జోష్ హజల్‌వుడ్, వన్డే సిరీస్‌లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జరిగే ఐపీఎల్ 2023 సీజన్‌లో మాత్రం జోష్ హజల్‌వుడ్ పాల్గొనబోతున్నాడు. భారత స్పిన్ పిచ్‌లకు తగ్గట్టుగా ఆడమ్ జంపాని బరిలో దించబోతున్న ఆస్ట్రేలియా జట్టు, మార్కస్ స్టోయినిస్‌కి కూడా వన్డే టీమ్‌లో చోటు దక్కింది..

ఆస్ట్రేలియా టెస్టు స్పెషలిస్టు ప్లేయర్లు మార్నస్ లబుషేన్‌తో పాటు స్టీవ్ స్మిత్ కూడా వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకున్నాడు. సీనియర్ బ్యాటర్ మిచెల్ మార్ష్‌కి వన్డే సిరీస్‌కి పిలుపునిచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా... టెస్టు సిరీస్ మధ్యలో స్వదేశానికి వెళ్లిన స్పిన్నర్ అస్టన్ అగర్‌ని తిరిగి వన్డే సిరీస్ కోసం ఇండియాకి రప్పించనుంది.. 

ఆరోన్ ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో వన్డే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన ప్యాట్ కమ్మిన్స్‌కి భారత్‌లో వన్డే సిరీస్‌ చాలా పెద్ద ఛాలెంజ్ కానుంది. 

వన్డే సిరీస్‌కి ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సీన్ అబ్బాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జే రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

వన్డే సిరీస్‌కి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజ్వేంద్ర చాహాల్,  మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయ్‌దేవ్ ఉనద్కట్ 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !