6 ఓవర్లలో 3 క్యాచ్ డ్రాప్‌లు! ప్రెషర్‌లో శ్రీకర్ భరత్... తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్...

Published : Mar 09, 2023, 10:52 AM IST
6 ఓవర్లలో 3 క్యాచ్ డ్రాప్‌లు!  ప్రెషర్‌లో శ్రీకర్ భరత్... తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్...

సారాంశం

India vs Australia 4th test: ట్రావిస్ హెడ్ క్యాచ్ డ్రాప్ చేసిన శ్రీకర్ భరత్... తెలుగు వికెట్ కీపర్‌పై తీవ్రమైన ట్రోలింగ్, తొలి వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్! 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో భాగంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిన తర్వాత ఇండోర్ టెస్టు గెలిచి సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చిన ఆసీస్‌కి ఆఖరి టెస్టులోనూ శుభారంభం దక్కింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా కలిసి దూకుడుగా ఆడుతూ మొదటి వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

మూడో టెస్టులో విశ్రాంతి తీసుకున్న మహ్మద్ షమీతో ఓపెనింగ్ ఓవర్ వేయించాడు రోహిత్ శర్మ. అయితే 10 రోజుల గ్యాప్ తర్వాత బంతి అందుకున్న మహ్మద్ షమీ, రిథమ్ అందుకోవడానికి టైం తీసుకున్నాడు...

మొదటి బంతికే భారీ వైడ్ వేసిన మహ్మద్ షమీ, మొదటి ఓవర్‌లో 10 పరుగులు ఇచ్చేశాడు. తొలి ఓవర్‌లో ఉస్మాన్ ఖవాజా ఆడిన షాట్‌ని ఆపగడంలో ఫెయిల్ అయిన వికెట్ కీపర్ శ్రీకర్ భరత్, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టు కనిపించాడు...

ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ బ్యాట్‌ని తాకుతూ వెళ్లిన బంతి, నేరుగా వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ చేతుల్లో వాలింది. అయితే దాన్ని ఒడిసిపట్టడంలో విఫలమైన భరత్, నేలపాలు చేశాడు. ఆ సమయానికి ట్రావిస్ హెడ్ స్కోరు 7 పరుగులు కాగా ఆస్ట్రేలియా 23 పరుగులు మాత్రమే చేసింది...

మొదటి 6 ఓవర్లలోనే వచ్చిన 3 అవకాశాలను అందుకోలేకపోయాడు శ్రీకర్ భరత్.  దీంతో అతన్ని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు సాక్ష్యాత్కరిస్తున్నాయి. మరో ఆప్షన్ లేకనే శ్రీకర్ భరత్‌ని టీమిండియా భరిస్తోందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. స్పిన్ పిచ్‌లపై ఇషాన్ కిషన్ ఫెయిల్ అవుతాడనే ఉద్దేశంతోనే రోహిత్, భరత్‌ని కొనసాగిస్తున్నాడని... అతను ఆ అవకాశాలను సరిగా వాడుకోలేకపోతున్నాడని విమర్శిస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.. 

శ్రీకర్ భరత్ ఇచ్చిన ఆస్ట్రేలియా ఓపెనర్లు చక్కగా వాడుకున్నారు. ఫాస్ట్ బౌలర్లు వికెట్లు తీయలేకపోవడంతో 10వ ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్‌ని బౌలింగ్‌కి దింపాడు రోహిత్ శర్మ...

తన మొదటి ఓవర్‌లోనే ఎల్బీడబ్ల్యూకి అప్పీలు చేసిన అశ్విన్, డీఆర్‌ఎస్ తీసుకోలేదు. టీవీ రిప్లైలో అది వికెట్లను మిస్ అవుతున్నట్టు తేలింది. ఆ తర్వాత ఓవర్‌లో ఉస్మాన్ ఖవాజా రనౌట్ ఛాన్స్ మిస్ చేశాడు శుబ్‌మన్ గిల్... రవి అశ్విన్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా ఆడిన షాట్‌ని అడ్డుకున్న శుబ్‌మన్ గిల్, మెరుపు వేగంతో వికెట్ల వైపు విసిరినా గురి తప్పింది. వికెట్లకు తగిలి ఉంటే ఉస్మాన్ ఖవాజా 10 పరుగుల వద్ద అవుటై ఉండేవాడు.. మొదటి గంటలో 14 ఓవర్లలో 56 పరుగులు చేసిన ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా డ్రింక్స్ బ్రేక్ తీసుకుంది.

డ్రింక్స్ బ్రేక్ తర్వాత మొదటి వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత ట్రావిస్ హెడ్ వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. 44 బంతుల్లో 7 ఫోర్లతో 32 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?