బీసీసీఐ ఒత్తిడికి దిగి వచ్చిన ఐసీసీ... ఇండోర్ పిచ్‌కి బిలో యావరేజ్ రేటింగ్‌ ఇస్తూ...

Published : Mar 27, 2023, 01:30 PM IST
బీసీసీఐ ఒత్తిడికి దిగి వచ్చిన ఐసీసీ... ఇండోర్ పిచ్‌కి బిలో యావరేజ్ రేటింగ్‌ ఇస్తూ...

సారాంశం

ఆరున్నర సెషన్లలోనే ముగిసిన ఇండోర్ టెస్టు... ఇంతకుముందు ఇండోర్ పిచ్‌కి  ‘Poor’ రేటింగ్ ఇచ్చిన ఐసీసీ, బీసీసీఐ అప్పీలుతో ‘Below Average’ కి మారుస్తూ నిర్ణయం.. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో భాగంగా జరిగిన మొదటి మూడు టెస్టులు కూడా మూడు రోజుల్లోనే ముగిసిపోయాయి. నాగ్‌పూర్ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన టీమిండియా, ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులోనూ మంచి విజయాన్ని అందుకుంది..

అయితే ఇండోర్‌లో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియాకి విజయం వరించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 197 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 163 పరుగులకే చాప చుట్టేసింది.. 78 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించిన ఆస్ట్రేలియా... 2023 పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది.  2-1  తేడాతో టీమిండియా ఆధిక్యాన్ని తగ్గించగలిగింది...

మూడో టెస్టు పట్టుమని మూడు రోజుల పాటు కూడా జరగలేదు. సరిగ్గా ఆరున్నర సెషన్లలోనే మ్యాచ్ ముగిసిపోయింది. దీంతో మార్చి 1 నుంచి 3 మధ్య మూడో టెస్టుకి ఆతిథ్యమిచ్చిన ఇండోర్ హోల్కర్ క్రికెట్ స్టేడియం పిచ్‌ని ‘Poor’ పిచ్‌గా రేటింగ్ ఇచ్చిన ఐసీసీ, ఎట్టకేలకు బీసీసీఐ ఒత్తిడితో వెనక్కి తగ్గింది...

మూడో టెస్టు మ్యాచ్ ఫుటేజీని పరిశీలించిన ఐసీసీ అప్పీల్ ప్యానెల్ సభ్యులు ఐసీసీ జనరల్ మేనేజర్ వసీం ఖాన్, ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ సభ్యుడు రోజర్ హర్పర్... ఈ పిచ్ మీద మరీ అంత దారుణమైన బౌన్స్ కనిపించలేదని ధృవీకరించి... ‘Poor’ నుంచి ‘బిలో యావరేజ్’ రేటింగ్‌కి మార్చారు...

యావరేజ్ కంటే తక్కువ రేటింగ్ దక్కడంతో ఇండోర్ పిచ్‌కి 1 డి-మెరిట్ పాయింట్‌ని చేర్చింది ఐసీసీ. ‘Poor’ రేటింగ్ దక్కి ఉంటే ఇండోర్ పిచ్‌ ఖాతాలో మూడు నుంచి ఐదు డి- మెరిట్ పాయింట్లు చేరి ఉండేవి. ఇదే జరిగితే భవిష్యత్తులో టెస్టు మ్యాచులు నిర్వహించేందుకు వీలులేకుండా అనర్హత వేటు పడేది..

ఒక్కసారి స్టేడియం ఖాతాలో పడిన డి-మెరిట్ పాయింట్లు ఐదేళ్ల పాటు యాక్టీవ్‌గా ఉంటాయి. అంటే ఈ ఐదేళ్ల సమయంలో ఇండోర్‌ స్టేడియంలో రెండు మూడు టెస్టులు జరిగే.. మొత్తంగా 5 డి-మెరిట్ పాయింట్లు చేరితే... ఆ పిచ్‌లో మ్యాచులు నిర్వహించకుండా 12 నెలల నుంచి నిషేధం విధిస్తుంది ఐసీసీ..

అదే 10 డి-మెరిట్  పాయింట్లు చేరితే ఏకంగా 24 నెలల పాటు నిషేధం పడుతుంది.  ‘Poor’ నుంచి ‘బిలో యావరేజ్’ రేటింగ్‌ మారడంతో ఇండోర్ పిచ్ ఈ నిషేధం నుంచి కూడా తప్పించుకున్నట్టైంది.. 

PREV
click me!

Recommended Stories

గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?