India vs Australia 2nd ODI: హాఫ్ సెంచరీలు బాదిన శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్... ఇదే జోరు కొనసాగితే...

By Chinthakindhi Ramu  |  First Published Sep 24, 2023, 3:30 PM IST

18 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 137 పరుగులు చేసిన టీమిండియా.... రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు.. 


ఇండోర్‌లో భారత బ్యాటర్లు బౌండరీల మోత మోగిస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ స్వల్ప స్కోరుకే అవుటైనా శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ కలిసి వరుస బౌండరీలు బాదుతూ, స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు..

 టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, ఇన్నింగ్స్‌ని నెమ్మదిగా ఆరంభించింది. 12 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్, క్రీజులోకి వచ్చినప్పటి నుంచి ఆసీస్ బౌలర్లపై కౌంటర్ అటాక్ చేశాడు..

Latest Videos

undefined

ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో 2 ఫోర్లు బాదిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో 2 ఫోర్లు బాది 11 పరుగులు రాబట్టాడు. అయ్యర్ దూకుడుకి అడ్డు కట్ట వేయాలని బౌలింగ్ మార్పులు చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు.

19 బంతుల్లో 9 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, సీన్ అబ్బాట్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో వరుసగా 6, 2, 4 బాది 14 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్ వేసిన 10వ ఓవర్‌లో 4, 6 బాదాడు శుబ్‌మన్ గిల్...
 
శుబ్‌మన్ గిల్ సిక్సర్ బాదగానే వర్షం రావడంతో దాదాపు 40 నిమిషాల పాటు ఆటను నిలిపివేశారు అంపైర్లు. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించారు గిల్, అయ్యర్.. 10 ఓవర్లు ముగిసే సమయానికి 80 పరుగులు చేసింది టీమిండియా... 

మొదటి 19 బంతుల్లో 9 పరుగులే చేసిన శుబ్‌మన్ గిల్, 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు శుబ్‌మన్ గిల్...

 మరో ఎండ్‌లో శ్రేయాస్ అయ్యర్ కూడా సిక్సర్‌తోనే హాఫ్ సెంచరీ మార్కు చేరుకోవడం విశేషం. స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్‌లో సిక్సర్ బాది, వన్డే కెరీర్‌లో 15వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు శ్రేయాస్ అయ్యర్..

గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయాస్ అయ్యర్ బ్యాటు నుంచి వచ్చిన బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే. ఈ ఇద్దరూ 85 బంతుల్లో 120 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. 18 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 137 పరుగులు చేసింది టీమిండియా.. 
 

click me!